ఎవరు రెచ్చగొడితే… -తెలంగాణ బిడ్డ ఆవేదన!

[ఎర్రవెల్లి మండలం కొండపాక (మల్లన్న సాగర్ ప్రాజెక్టు) లో పోలీసుల లాఠీచార్జినీ, తెలంగాణ ప్రజలపై కే‌సి‌ఆర్ కుటుంబం చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ మిత్రుడు ఫేస్ బుక్ లో చేసిన వ్యాఖ్య ఇది. తెలంగాణ ప్రజలకు కావలసింది దొరల తెలంగాణ కాదని, జన తెలంగాణ అని ఆనాడే ప్రజా సంఘాలు చేసిన డిమాండు ఎంత సంబద్ధమో ఈ వ్యాఖ్య, ఫోటోలు చెబుతున్నాయి.] ********* –గంగాధర్ మాకం ఎవరు రెచ్చగొడితే తెలంగాణ‌ కోసం ప్రాణాలకు తెగించి కొట్లాడినమో… ఎవరు రెచ్చగొడితే…

రెండు రాష్ట్రాలు, ఒక సవాలు -ది హిందు ఎడిట్

[Two states, one challenge శీర్షికన ఈ రోజు ప్రచురితం అయిన ది హిందు ఎడిటోరియల్ కు ఇది యధాతధ అనువాదం. -విశేఖర్] ********************* తాము ఏర్పడిన ఏడాది తర్వాత కూడా తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలు శక్తి, నీరు ఇతర ఆస్తులు లాంటి వనరుల పంపకం సమస్యలతో సతమతం అవడం కొనసాగుతూనే ఉంది. అవిభాజ్య రాష్ట్ర ఆదాయంలో 22 శాతం వాటా కలిగి ఉన్న హైద్రాబాద్ నుండి రెవిన్యూ ప్రవాహం లేకపోవడంతో, గత యు.పి.ఏ ప్రభుత్వం…

వేడిగాలులకి 1100 మంది బలి -ఫోటోలు

భారత దేశాన్ని, అందునా దక్షిణ భారతాన్ని, అందులోనూ తెలుగు రాష్ట్రాలైన ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలను వేడి గాలులు పట్టి ఊపేస్తున్నాయి. గత వారం రోజుల్లోనే వెయ్యికి పైగా ప్రజలు వడగాలులకు బలైపోగా మొత్తం మీద ఈ వేసవి కాలంలో వడదెబ్బకు గురై మరణించినవారి సంఖ్య 1100 దాటి పోయిందని జాతీయ, అంతర్జాతీయ పత్రికలు తెలిపాయి. దాదాపు ప్రతి అంతర్జాతీయ వార్తా సంస్ధ భారత దేశంలో వేడి గాలుల గురించి గత కొద్ది రోజులుగా తప్పనిసరిగా వార్తలు…

విద్యుత్ కోతలతో అల్లాడుతున్న తెలంగాణ

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ప్రతీకారం వల్లనోఏమో తెలియదు గానీ తెలంగాణ జిల్లాలు విద్యుత్ కోతలతో అల్లాడుతున్నాయి. డిమాండ్ కు సరఫరాకు మధ్య భారీ అంతరం తలెత్తడంతో వేసవి చాలా దూరం ఉన్నా అప్పుడే వేసివి తరహా కోతలను తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తోంది. అధికారిక కోతలు పట్టణాల్లో రోజుకు 4 గంటలు అని ప్రకటించి అనధికారికంగా మరిన్ని గంటలు కోత విధిస్తున్నారు. పల్లెల గురించి చెప్పుకోకపోతేనే మేలు. తెలంగాణలో విద్యుత్ కోతలకు ప్రధాన బాధితులు అక్కడి రైతాంగం.…

టి.ఎస్ నుండి ఎ.పికి తరలనున్న పన్ను పునాది

గాలిలో దుమ్ము మెల్ల మెల్లగా సర్దుకునే కొద్దీ అసలు చిత్రం ఏమిటో క్రమ క్రమంగా స్పష్టం అవుతోంది. విభజనానంతర ఆంధ్ర ప్రదేశ్ ఆర్ధిక స్ధితి కనాకష్టంగా ఏమీ ఉండదని ఆలోచనాపరులు లెక్కలు వేసి చెప్పినా సమైక్యవాదులు చెవిన ఎక్కించుకోలేదు. వారు చెప్పిన అంశాలు ఎంత నిజమో ఇప్పుడు తెలిసి వస్తోంది. ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా హైద్రాబాద్ నగరం ఉనికి ఆగిపోయినప్పటి నుండి హైద్రాబాద్ నగర పన్ను పునాది భారీ మొత్తంలో తుడిచిపెట్టుకుపోనుంది. నిజానికి…

ఆజన్మ వైరం: బాబు Vs కె.సి.ఆర్ -కార్టూన్

ఎ.పి ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి ఒకరినొకరు ఆక్షేపించని రోజు లేకుండా పోతోంది. పోలవరం ముంపు గ్రామాల విలీనంతో మొదలుకుని ఇంజనీరింగ్ సీట్ల కేటాయింపు, ఫీజుల చెల్లింపుల వరకూ ఇరు ప్రభుత్వాలూ తగాదా పడుతూనే ఉన్నారు. స్వాతంత్ర దినం నాడు కూడా ఒకరు విభజన పద్ధతి ప్రకారం జరగలేదంటే మరొకరు ఇంకోటన్నారు. పుడుతూనే పౌరుషాలతో, పంతాలతో కొట్లాడుతూ పుట్టిన తెలుగు పుంజులు ఇరు రాష్ట్రాల ప్రజలకు లేని సమస్యలు సృష్టిస్తున్నారు. చల్లబరచాల్సిన అనవసర భావోద్వేగాలను రెచ్చగొడుతున్నారు. ఇది వారి…

మూజువాణి: తెలంగాణ మాదిరిగానే జ్యుడీషియల్ బిల్లు కూడా

సుప్రీం కోర్టు, హై కోర్టులకు జడ్జిల నియామకంలో పార్లమెంటుకు కూడా అధికారాలు కట్టబెట్టడానికి ఉద్దేశించిన బిల్లు లోక్ సభలో ఆమోదం పొందింది. 121వ రాజ్యాంగ సవరణ, నేషనల్ జ్యుడీషియల్ అపాయింట్ మెంట్స్ కమిషన్ ఏర్పాటు లను అమలులోకి తెచ్చే బిల్లు మూజు వాణి ఓటుతో ఆమోదం పొందడం ప్రత్యేకంగా గమనించవలసిన విషయం. తెలంగాణ బిల్లును ఆనాటి లోక్ సభ, రాజ్య సభలు మూజు వాణి ఓటుతో ఆమోదం పొందినపుడు అనేకమంది రాజకీయవేత్తలు, ఎ.పి.ఎన్.జి.ఓ లాంటి ఆందోళన సంస్ధలు,…

సామాజిక తెలంగాణా? కె.సి.ఆర్ తెలంగాణా? -కార్టూన్

నూతన రాష్ట్రం తెలంగాణ ఆవిర్భావాన్ని ది హిందూ కార్టూనిస్టు కేశవ్ ఇలా వ్యక్తీకరించారు. ఏమిటి దీనర్ధం? సామాజిక తెలంగాణను హామీ ఇచ్చిన కె.సి.ఆర్ తన కుటుంబ తెలంగాణ మాత్రమే ఇచ్చారనా? కె.సి.ఆర్ బలం అంతా తెలంగాణ మాత్రమే అనా? కె.సి.ఆర్ బలం తెలంగాణ వాపులోనే ఉందని, అది త్వరలో తగ్గిపోతుందని (వాపు తగ్గాక నూతన రాష్ట్రం వల్ల ఒరిగిందేమీ లేదని ప్రజలు తెలుసుకుంటారని) అర్ధమా? పాఠకుల్లో ఎవరన్నా చెప్పగలరా?

తెలంగాణ మొదటి అడుగు: కె.సి.ఆర్ వాగ్దాన ఉల్లంఘన

నూతన రాష్ట్రం తెలంగాణ ఆవిష్కృతం అయింది. ఉద్యమ పార్టీ నేతగా కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారు తెలంగాణ మొదటి ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. 11 మంది మంత్రులతో కొలువు తీరిన నూతన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ముఖ్యమంత్రితో సహా ముగ్గురు ఒకే కుటుంబానికి చెందినవారు. అనగా దాదాపు 25 శాతం ఒకే కుటుంబ మంత్రులతో కూడిన మంత్రివర్గాన్ని కొత్త రాష్ట్రం తలకెత్తుకుంది. తెలంగాణ ఉద్యమాన్ని సైతం కుటుంబ ఉద్యమంగా నడిపిన ఆరోపణలు ఎదుర్కొన్న కె.సి.ఆర్…

విభజన గోతిలో కాంగ్రెస్, ఒడ్డున కె.సి.ఆర్ -కార్టూన్

విభజన కోసం అహోరాత్రాలు శ్రమించిన కాంగ్రెస్ ను గోతిలోనే వదిలేసి విభజన ఫలాలను తాను మాత్రమే అందుకోవడం కోసం కె.సి.ఆర్ ప్రయత్నిస్తున్నారని కార్టూన్ సూచిస్తోంది. ఒడ్డు చేరేదాకా పడవ మల్లయ్య, ఒడ్డు చేరాక బోడి మల్లయ్య అయినట్లు! తెలంగాణ ఇస్తే టి.ఆర్.ఎస్ పార్టీని కాంగ్రెస్ లో కలిపేస్తానని కె.సి.ఆర్ గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. విలీనానికి కార్యకర్తలు ఒప్పుకోవడం లేదని కె.సి.ఆర్ ఇప్పుడు చెబుతున్నారు. కనీసం పొత్తుకి కూడా ఆయన అంగీకరించేట్లు లేరని కొన్ని పత్రికలు చెబుతున్నాయి.…

సోనియా చెయ్యి కట్టేసిన కె.సి.ఆర్? -కార్టూన్

తెలంగాణ ఇస్తే టి.ఆర్.ఎస్ ని కాంగ్రెస్ లో కలిపేస్తానని హామీ ఇచ్చిన కె.సి.ఆర్ ఇప్పుడు మొండి చెయ్యి చూపుతున్నట్లు ఈ కార్టూన్ సూచిస్తోందా? కానీ విలీనం చర్చలు జరుగుతున్నాయని నేడో, రేపో నిర్ణయం వచ్చేస్తుందని కదా పత్రికలు చెబుతున్నది? సోనియా ముందు టి.ఆర్.ఎస్ నేతలు ఒక వాదన ఉంచినట్లు కొద్ది రోజుల క్రితం ఒక ఊహాగానం వెలువడింది. దీని ప్రకారం విలీనం కంటే కలిసి పోటీ చేస్తేనే ఎక్కువ ఉపయోగం అని టి.ఆర్.ఎస్ నేతలు కాంగ్రెస్ కు…

లగడానంద స్వామి -టి.వి9 సెటైర్ (వీడియో)

వెక్కి వెక్కి ఏడ్చి రాజకీయ సన్యాసం పుచ్చుకున్న దరిమిలా లగడానంద స్వామిగా అవతరించిన రాజగోపాల్, ఆఫీసుల్లో నిద్ర చెడగొట్టడమే కాకుండా సోనియా శివుడి వద్ద షిండే నందిచే తన్నించుకున్న అశోక్ బాబు, లాస్ట్ బాల్ లేదు, వేస్ట్ బాల్ మాత్రమే అంటూ బాల్ జేబులో పెట్టుకొని పోయిన కిరణ్ కుమార్ రెడ్డి… ఇత్యాది సెటైర్లతో టి.వి9 ప్రోగ్రామ్ ‘బుల్లెట్ న్యూస్’ మహా వినోదం పంచింది. తప్పకుండా చూడాల్సిన వీడియో ఇది. బహుశా తెలంగాణ ఉద్యమం పైన టి.వి9 రూపొందించిన…

ప్రశ్న: లోక్ సభలో బిల్లు ప్రవేశపెట్టడంపై రాద్ధాంతమేల?

ఉమేష్ పాటిల్: హాయ్ సర్, పార్లమెంటులో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టాం అని ప్రభుత్వం, ప్రవేశపెట్టలేదు అని ప్రతిపక్షం వాళ్ళు అన్నారు కదా. 1)అసలు దానికి అంత రాద్ధాంతం ఎందుకు? 2) ప్రవేశపెట్టింది మళ్ళీ ప్రవేశపెట్టలేమా? 3) అసలు ప్రవేశపెడితే ఏమి జరుగుతుంది? 4) మళ్ళీ ప్రవేశపెట్టడానికి ప్రభుత్వం ఎందుకు అభ్యంతరం తెలిపింది? సమాధానం: 1) ప్రవేశపెట్టడం పైనే అంత రాద్ధాంతం చేయడానికి ప్రధాన కారణం వివిధ పార్టీలకు ఉన్న రాజకీయ స్వార్ధ ప్రయోజనాలు. తెలంగాణ వ్యతిరేకులు బిల్లును…

తెలంగాణ నవ్వింది -కార్టూన్

పెద్దల సభ రాజ్య సభ ఆమోద ముద్రతో ‘ఆంధ్ర ప్రదేశ్ పునర్వ్యవస్ధీకరణ బిల్లు 2014’ తెలంగాణ రాష్ట్ర నిర్మాణంలో చివరి ఇటుకలను చేర్చింది. ఇక లాంఛనప్రాయం మాత్రమే అయిన రాష్ట్రపతి సంతకమే మిగిలింది. రాష్ట్రపతి సంతకం కూడా అయ్యాక గెజిట్ ప్రకటనతో సదరు బిల్లు చట్టంగా ఆచరణలోకి వస్తుంది. ఉభయ సభల ఆమోదమే తెలంగాణ ఏర్పాటుకు కీలకం. అది కాస్తా పూర్తయింది. దానితో ‘నవ్వింది మల్లె చెండూ’ తరహాలో తెలంగాణ నవ్వింది. ఆ నవ్వు ఢిల్లీ పార్లమెంటు…

రాజ్యసభలో తెలంగాణ బిల్లుకు బి.జె.పి ఆటంకం?

‘ఆంధ్ర ప్రదేశ్ పునర్వ్యవస్ధీకరణ బిల్లు 2014’ బిల్లు బుధవారం (ఫిబ్రవరి 19) రాజ్యసభలో ప్రవేశించలేదు. ఇందుకు బి.జె.పి కారణంగా నిలిచింది. లోక్ సభలో బిల్లుకు ఒక్క సవరణ కూడా ప్రతిపాదించని బి.జె.పి రాజ్యసభలో మాత్రం 32 సవరణలు చేయాలంటూ బయలుదేరింది. దీనికి కాంగ్రెస్ ఒప్పుకోలేదు. ఫలితంగా తెలంగాణ బిల్లు లేకుండానే రాజ్య సభ వాయిదా పడింది. లోక్ సభలో ఆమోదం పొందిన బిల్లుకు రాజ్యసభలో సవరణలు చేస్తే రాజ్యాంగ సూత్రాల రీత్యా సమస్య వస్తుంది.  రాజ్యసభలో బిల్లుకు…