లోక్ సభలో తెలంగాణ బిల్లు, లగడపాటి పెప్పర్ స్ప్రేతో కల్లోలం

తెలంగాణ బిల్లును లోక్ సభలో ప్రవేశ పెట్టారు. హోమ్ మంత్రి సుశీల్ కుమార్ షిండే బిల్లును ప్రవేశపెడుతుండగానే లగడపాటి బరితెగించి పాల్పడిన చర్య తీవ్ర అల్లకల్లోలానికి దారి తీసింది. లోక్ సభ వెల్ లోకి ప్రవేశించిన రాజగోపాల్ జేబులో నుంచి పెప్పర్ స్ప్రే (మిరియాల పొడి కలిపిన ద్రావకం) బైటికి తీసి సభ నలువైపులా జల్లడంతో స్పీకర్ తో సహా పలువురు సభ్యులు అశ్వస్ధతకు గురయ్యారు. రాజగోపాల్ సృష్టించిన గందరగోళం పలువురి ఖండన మండనలతో పాటు 17…

తెలంగాణ: జి.ఓ.ఎం ఆమోదం, వచ్చేవారం పార్లమెంటులో

“ఎ.పి అసెంబ్లీ తిరస్కరించిన బిల్లును ఎలా చేపడతారు?” ఇది ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ అట్టహాసంగా, వంది మాగధులు చప్పట్లు చరుస్తుండగా వేసిన ప్రశ్న! ఈ ప్రశ్నకు మొదటి సమాధానం వచ్చింది. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయమై నియమించిన మంత్రుల కమిటీ (గ్రూప్ ఆవ్ మినిష్టర్స్) ఈ సమాధానం ఇచ్చింది. మాటలతో కాదు, చేతలతో. ‘ఆంధ్ర ప్రదేశ్ పునర్వ్యవస్ధీకరణ బిల్లు –2013’ ముసాయిదాకు జి.ఓ.ఎం ఆమోదం తెలిపిందని పత్రికలు తెలిపాయి. “తెలంగాణ ముసాయిదా బిల్లుకు జి.ఓ.ఎం…

విభజన అధికారం పార్లమెంటుదే – ప్రొ.కె.నాగేశ్వర్ (10టివి)

తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు గురించి ప్రొఫెసర్ నాగేశ్వర్ కొన్ని ముఖ్యమైన విషయాలను తెలిపారు. కార్మికులు, ఉద్యోగుల భాగస్వామ్యంతో ఏర్పడిన 10టి‌విలో ఆయన నిన్న మాట్లాడుతూ రాష్ట్రాల విభజనపై రాజ్యాంగం ఏమి చెబుతోందో వివరించారు. దాదాపు అన్ని రాజకీయ పార్టీలూ తలా ఒక ప్రకటన చేస్తూ జనాన్ని రకరకాలుగా మభ్య పెడుతూ  గందరగోళంలో పడేస్తున్న పరిస్ధితుల్లో నాగేశ్వర్ గారు ఇచ్చిన వివరణ చాలా ఉపయోగంగా ఉంది. అందులో కొంత భాగం: ” ప్రస్తుతం రాష్ట్ర విభజనపై నేతలు…

తెలంగాణ రాష్ట్రం కోసం 48 గంటల బంద్ -ఫొటోలు

రెండు రోజు తెలంగాణ బంద్ విజయవంతమైంది. ఒక్క సైబరాబాద్ మినహా తెలంగాణ ప్రాంతంలోని పది జిల్లాల్లోనూ బంది సక్సెస్ అయింది. కేంద్రం మాత్రం తొందరపడడం లేదు. డిసెంబరు 9, 2009 నాటి ప్రకటన అనంతరం సీమాంధ్ర జిల్లాల్లో ప్రజా ప్రతినిధుల రాజినామాలతో పాటు, రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా ప్రజలు కూడా ఉద్యమించడంతో కొద్ది రోజులకే ఆ ప్రకటనను కేంద్రం వెనక్కి తీసుకోవలసి వచ్చింది. ఆ అనుభవం ఇంకా పీడకలగా కాంగ్రెస్‌ను వెన్నాడుతోంది. దానితో ఏ నిర్ణయమూ తీసుకోకుండా…

రెండు రోజుల బంద్‌తో తెలంగాణలో స్తంభించిన సాధారణ జనజీవనం

తెలంగాణ ప్రాంతంలో తెలంగాణ జె.ఎ.సి ఇచ్చిన 48 గంటల బంద్ విజయవంతమైందనే చెప్పాలి. రెండో రోజు వరసగా సాధారణ జన జీవనం స్తంబించిపోయింది. స్కూళ్ళు, కాలేజిలు, షాపులు, పెట్రోల్ పంపులు ఇంకా ఇతర వ్యాపార సంస్ధలన్నీ మూసివేశారు. వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలు స్తంభనకు గురయ్యాయి. రవాణా వ్యవస్ధ తెలంగాణలోని పది జిల్లాల్లోనూ ప్రతిష్టంభనకు గురయ్యింది. హైద్రాబాదులో కూడా బందు పూర్తిగా విజయవంతమైందని పత్రికా సంస్ధలు తెలిపాయి. ఎ.పి.ఎస్.ఆర్.టి.సి ముందు జాగ్రత్తతో వ్యవహరించి బస్సులను గ్యారేజిలకే పరిమితం చేశారు.…