తెరేష్ బాబు విభజన గీత -సంస్మరణ

కవి, తెలంగాణ రాష్ట్ర వాసి పైడి తెరేష్ బాబు గారు చనిపోయారని మిత్రుల ద్వారా తెలిసింది. ఆయనతో నాకు వ్యక్తిగత పరిచయం లేదు. కానీ ఉద్యమ భావజాల సంబంధం వ్యక్తిగత పరిచయాలకు అతీతమైనది. ఆ కారణం వలన ఆయనకు నాకు మధ్య భావాత్మక వారధిగా నిలిచిన ‘విభజన గీత’ను, సంస్మరణ కోసం పునర్ముద్రిస్తున్నాను. పీడిత జనం ప్రపంచంలో ఏమూల ఉన్నా వారికి కూడా తెలియని ఒక సార్వజనీన ఏకత్వం వారి మధ్య ఏర్పడిపోయి ఉంటుంది. అది ఒక్కోసారి…

విభజన ‘గీత’ -మరిన్ని శ్లోకాలు

రచన: తెరేష్ బాబు పైడి (పైడిశ్రీ) “బల్బో బస్సాహి సమ్మ్యామ్యహం దీక్షో భగ్నాయ వినిర్గతీ!!!” అపార్థా…! ఆరే ప్రతి బల్బు వెలగక తప్పదు ఆగే ప్రతి బస్సు కదలక తప్పదు జరిపే ప్రతి సమ్మె ఆపక తప్పదు చేసే ప్రతి దీక్ష భగ్నం కాక తప్పదు ఇవన్నియు ఢిల్లీ వలననే సంభవించుచున్నవి టీ టిటిటి ట్యూం టుయ్ [ఇది వీణా నాదము] ***                ***                *** కోతోహి చింపాంజీ నక్కస్య గోతో! మంత్రామ్యహి ముఖ్యోతి! జీవస్య ఎంజీవం…