అరుణాచల్ సరిహద్దు: దలైలామా పాచిక విసిరిన అమెరికా?

ఇండియా, చైనా సరిహద్దు సమస్య పరిష్కారం ముంగిట ఉన్నదని చైనా ప్రకటించిన కొద్ది రోజులకే ఇరు దేశాల మధ్య దలైలామా సందర్శన విషయమై ఘర్షణ చెలరేగడం కాకతాళీయమా లేక పధకం ప్రకారం జరిగిందా? ఇండియా, చైనాల మధ్య సరిహద్దు సమస్య శాంతియుతంగా, ఎవరి జోక్యం లేకుండా… ముఖ్యంగా అమెరికా, పశ్చిమ రాజ్యాల జోక్యం లేకుండా పరిష్కారం కావడం ఇష్టం లేకనే అర్జెంటుగా దలైలామా అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్ర సందర్శనకు పధకం రచించబడిందని భౌగోళిక రాజకీయ విశ్లేషకులు అనుమానిస్తున్నారు.…