తూర్పు, దక్షిణ ఉక్రెయిన్ లపై రష్యా దాడులు, గందరగోళంలో అమెరికా!

రష్యన్ బలగాలు తూర్పు మరియు దక్షిణ ఉక్రెయిన్ రాష్ట్రాలలోని నగరాలపై దాడులు చేస్తోంది. ప్రస్తుతం వైమానిక దాడుల వరకే రష్యా పరిమితమయింది. రష్యా సైనికులు మాత్రం తూర్పు ఉక్రెయిన్ వరకే పరిమితం అయ్యారు. రాయిటర్స్ ప్రకారం రష్యన్ బలగాలు ఉక్రెయిన్ లోని పలు బలగాలపై వైమానిక దాడులు చేస్తున్నాయి. రష్యా దాడులను పూర్తి స్థాయి దాడిగా చెప్పలేని గందరగోళంలో అమెరికా పడిపోయినట్లు కనిపిస్తోంది. డోనెట్స్క్ పీపుల్స్ రిపబ్లిక్ (డి‌పి‌ఆర్), లుగాన్స్క్ పీపుల్స్ రిపబ్లిక్ (ఎల్‌పి‌ఆర్) లను స్వతంత్ర…

ఉక్రెయిన్: రష్యా హఠాత్ నిర్ణయం!

ఉక్రెయిన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తలపడుతున్న తూర్పు ఉక్రెయిన్ ప్రాంతాల విషయంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ సోమవారం హఠాత్తుగా ఎవరూ ఊహించని నిర్ణయం ప్రకటించాడు. తమను తాము స్వతంత్ర రిపబ్లిక్ లు గా ప్రకటించుకున్న డోనెట్స్క్, లుగాన్స్క్ (లేదా లుహాన్స్క్) లను స్వతంత్ర రాజ్యాలుగా గుర్తిస్తున్నట్లు ప్రకటించాడు. తలవని తలంపుగా వెలువడిన ఈ ప్రకటనకు ఎలా స్పందించాలో అర్ధం కాని అయోమయంలో అమెరికా తదితర పశ్చిమ రాజ్యాలు పడిపోయినట్లు కనిపిస్తున్నాయి. ఉక్రెయిన్ పై దాడి చేస్తే తీవ్రంగా ప్రతిస్పందిస్తామని…

క్రిమియాపై సంక్షోభం -ద హిందు ఎడిట్..

[ద హిందూ ఎడిటోరియల్ -13/08/2016- “The crisis over Crimea” కు యధాతధ అనువాదం] ********* ఉక్రెయిన్ మద్దతుతో క్రిమియాలో ఉగ్రవాద దాడులు చేయడానికి సిద్ధబడిన విధ్వంసకారుల ప్రయత్నాలను వమ్ము చేశామంటూ రష్యా చేసిన ప్రకటన ఇరు దేశాల మధ్యా ప్రధాన చర్చాంశంగా తెర మీదికి వచ్చింది. 2014లో ఉక్రెయిన్ నుండి రష్యాలో కలిపినప్పటినుండీ క్రిమియా ద్వీపకల్పంలో మాస్కో భారీ మొత్తంలో సైన్యాన్ని మోహరించింది. “ఉగ్రవాదులకు మద్దతు ఇవ్వడానికి” వ్యతిరేకంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుటిన్ గట్టి…

మాకీ యుద్ధం వద్దు బాబోయ్ -ఉక్రెయిన్ మహిళలు (వీడియో)

తూర్పు ఉక్రెయిన్ ప్రాంతాల మీద అమానుషంగా దాడి చేస్తున్న ఉక్రెయిన్ ప్రభుత్వం ఉక్రెయిన్ యువకులను బలవంతంగా యుద్ధ క్షేత్రానికి తరలిస్తోంది. ఉక్రెయిన్ సైన్యాలు ఫైటర్ జెట్ లతో ఇళ్ళు, భవనాలు, పాఠశాలలు, హోటళ్లు, కాలేజీలు… ఇలా కనపడిందల్లా కూల్చివేస్తుండడంతో డొనేట్స్క్, లుగాన్స్క్ రాష్ట్రాలు తీవ్రమైన మానవతా సంక్షోభం (humanitarian crisis) లో ఉన్నాయి. పెద్ద మొత్తంలో ప్రజలు సరిహద్దు దాటి శరణార్ధులుగా రష్యాకు తరలిపోతున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే తూర్పు ఉక్రెయిన్, ఉక్రెయిన్ కు మరో గాజా…

తూర్పు ఉక్రెయిన్: ఉక్రెయిన్ బలగాల లొంగుబాటు

తూర్పు ఉక్రెయిన్ తిరుగుబాటు దళాల చుట్టివేత నుండి బైటపడేందుకు చేసిన ప్రయత్నాలన్నీ విఫలం కావడంతో ఉక్రెయిన్ పశ్చిమ అనుకూల ప్రభుత్వ బలగాలు ‘బ్రతుకు జీవుడా’ అంటూ లొంగిపోతున్నాయి. ‘ప్రత్యేక టెర్రరిస్టు అణచివేత కార్యక్రమం’ పేరుతో డోనేట్స్క్, లుగాన్స్క్ ప్రాంతాలపైకి దండెత్తిన ఉక్రెయిన్ సైన్యం గత రెండు నెలలుగా అమానుష కృత్యాలకు తెగబడింది. విచక్షణా రహితంగా బాంబుదాడులు చేయడంతో 100 మందికి పైగా ప్రజలు చనిపోయారు. ఈ క్రమంలో రెండు బ్రిగేడ్ల సైన్యాన్ని డాన్ బాస్ మిలీషియా చుట్టుముట్టడంతో…

MH17: మీడియా చెప్పనిదేమిటి? -అమెరికా హౌస్ సభ్యుడు రాన్ పాల్

(రాన్ పాల్ అమెరికా ప్రతినిధుల సభ (హౌస్ ఆఫ్ రిప్రెజెంటేటివ్స్ – మన లోక్ సభకు సమానం)లో 2013 వరకు సభ్యుడు. అమెరికా అధ్యక్ష పదవికి లిబర్టేరియన్ పార్టీ అభ్యర్ధిగా పోటీ చేశారు. రిపబ్లికన్ పార్టీ ప్రైమరీల్లో రెండు సార్లు అధ్యక్ష పదవికోసం పోటీ పడ్డారు. అమెరికా రహస్య గూడచార సంస్ధ ఎన్.ఎస్.ఏ అరాచకాలను బైటపెట్టిన ఎడ్వర్డ్ స్నోడెన్ తాను రాన్ పాల్ కే ఓటు వేశానని బహిరంగంగా చెప్పాడు. అమెరికా బహుళజాతి కంపెనీలకు రాన్ పాల్…