ఉక్రెయిన్: మరో 2 ప్రాంతాలు స్వయం పాలనకు నిర్ణయం

ఉక్రెయిన్ సంక్షోభం కొండవీటి చాంతాడు లాగా కొనసాగుతూనే ఉంది. తాజాగా మరో రెండు తూర్పు ఉక్రెయిన్ ప్రాంతాలు స్వయం పాలన ప్రకటించుకున్నాయి. తాము నిర్వహించిన రిఫరెండంలో ఉక్రెయిన్ నుండి విడిపోయి స్వతంత్రంగా ఉండడానికే ప్రజలు నిర్ణయించారని దోనెత్స్క్, లుహాన్స్క్ ప్రాంతాల తిరుగుబాటు నేతలు ప్రకటించారు. రిఫరెండంను రష్యా కుట్రగా ఉక్రెయిన్ పాలకులు తిట్టి పోశారు. రిఫరెండంను వాయిదా వేయాలని రష్యా అధ్యక్షుడు కోరినప్పటికీ దానికి తిరుగుబాటుదారులు అంగీకరించలేదు. రిఫరెండం ఫలితాల నేపధ్యంలో రష్యాపై మరిన్ని ఆంక్షలు విధించేందుకు…