తుపాకుల కాపలాలో అమెరికా స్వేచ్ఛ! -కార్టూన్

స్వేచ్ఛా, స్వాతంత్ర్యాలకు తానే అసలు ప్రతినిధినని చెప్పుకుంటుంది అమెరికా. వ్యక్తిగత స్వేచ్ఛను మించింది లేదని అంటుంది అమెరికా. (స్వేచ్ఛా హక్కు లాంటి ప్రాధమిక హక్కులకు హేతుబద్ధమైన పరిమితులు -reasonable restrictions- ఉండాలంటుంది భారత రాజ్యాంగం.) భారీ లిబర్టీ విగ్రహం సాక్షిగా చూపే అమెరికాలో లిబర్టీ, శిలగా తప్ప బతకలేని పరిస్ధితి అంటే అతిశయోక్తి కాదు. ప్రపంచంలో స్వేచ్ఛను స్ధాపిస్తానంటూ బాంబులు, ఫిరంగులతో బయలుదేరే అమెరికా అత్యంత కరుడుగట్టిన నియంతృత్వ రాజ్యాలకు కాపలా కాయడమే కాక ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికయిన…