ఢిల్లీ అత్యాచారం నిందితుడు రాంసింగ్ హత్య?

ఫిజియో ధెరపీ విద్యార్ధిని జ్యోతి సింగ్ పాండే పైన ఢిల్లీ బస్సులో జరిగిన సామూహిక అత్యాచారం కేసులో ప్రధాన నిందితుడు రామ్ సింగ్ ఆత్మహత్య చేసుకున్నాడని జైలు అధికారులు చెబుతుండగా అతన్ని హత్య చేశారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. జైలులోని ఇతర ఖైదీలు రామ్ సింగ్ ని హత్య చేశారని, హత్య చేశాక సెల్ గేటు ఊచలకు వేలాడగట్టారని వారు ఆరోపిస్తున్నారు. రామ్ సింగ్ ను చంపుతామని ఖైదీలలో కొందరు మొదటి నుండి చెబుతున్నారని, ఆ మేరకు…

హజారే కోసం తీహార్ జైలు వద్ద మద్దతుదారుల ఎదురుచూపు -ఫొటోలు

ప్రత్యేక మెజిస్ట్రేట్ ఆదేశాల మేరకు అన్నా హజారేతో పాటు కిరణ్ బేడీ, అరవింద్ కేజ్రీవాల్, శాంతిభూషణ్ తదిరతరులను తీహార్ జైలుకి తీసుకెళ్ళిన కొన్ని గంటలకే ప్రభుత్వం వారి విడుదలకు ఆదేశాలిచ్చింది. ఇతర నాయకులు బైటికి వచ్చినప్పటికీ అన్నా హజారె బైటికి రావడానికి తిరస్కరించాడు. తన దీక్షకు బేషరతు అనుమతి ఇచ్చేవరకూ బైటికి వచ్చేది లేదని ప్రభుత్వానికి తెగేసి చెప్పాడు. దానితో ప్రభుత్వానికి గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్టయింది. మంగళవారం రాత్రినుండీ హజారే మద్దతుదారులు తీహార్ జైలు గేటు…