గుల్బర్గ్ హత్యాకాండ: దక్కని న్యాయం

గుల్బర్గ్ హత్యాకాండ బాధితులకు చివరికి తీరని శోకం, అసంతృప్తి, వేదన, నిస్పృహ మాత్రమే దక్కాయి. కాంగ్రెస్ పార్టీకి చెందిన పార్లమెంటు సభ్యుడు ఎహసాన్ జాఫ్రీతో సహా 69 మంది ముస్లింలను ఊచకోత కోసిన కేసులో 24 మందిని మాత్రమే దొషులుగా ట్రయల్ కోర్టు తేల్చింది. ఆ 25 మందిలో కూడా 11 మంది మాత్రమే హత్యలకు బాధ్యులుగా కోర్టు గుర్తించింది. పోలీసులు మొత్తం 60 మందిపై అభియోగాలు మోపగా 36 మందిని కోర్టు నిర్దోషులుగా తీర్పు చెప్పింది.…

తీస్తా సెతల్వాద్ పై తప్పుడు కేసు ఆపండి, మోడీ ప్రభుత్వంతో సుప్రీం

గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడి ఆధ్వర్యంలో ముస్లిం లపై జరిపిన అమానుష ‘హత్యాకాండ’ లో దోషులకి శిక్ష పడడానికి అలుపెరుగని పోరాటం నిర్వహిస్తున్న తీస్తా సేతల్వాద్ పై మోడీ ప్రభుత్వం పెట్టిన కేసు ‘తప్పుడు కేసు’ అనీ, ‘మానవ హక్కులను’ తీవ్రంగా ఉల్లంఘిస్తున్నదనీ సుప్రీం కోర్టు మరో సారి తేల్చి చెప్పింది. ఆమె పై పెట్టిన ‘తప్పుడు కేసు’ లో జరుపుతున్న పరిశోధనను ఆపేయాలని గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వ అటార్నీని కోరింది. అయితే ఇప్పటికే కేసులో చార్జి…