క్లుప్తంగా… 03.05.2012

జాతీయం బెంగాల్ ప్రజలు అడుక్కునేవాళ్ళు కాదు –మమత లెఫ్ట్ ఫ్రంట్ ప్రభుత్వం తీసుకున్న అప్పులపై మూడేళ్లు వడ్డీ చెల్లింపులు నిషేధించాలని తాను చేసిన డిమాండ్ ని కేంద్రం పట్టించుకోకపోవడం పై మమత ఆగ్రహం వ్యక్తం చేసీంది. ఈ విషయంలో తన బాధ్యతను కేంద్రం విస్మరించడానికి వీల్లేదని, బెంగాల్ ప్రజలేమీ అడుక్కోవడం లేదనీ మమత బెనర్జీ వ్యాఖ్యానించింది. తాము ప్రత్యేక ప్యాకేజీ అడగడం లేదనీ అది వారు ఇచ్చిన హామీయే కనుక దాన్ని నెరవేర్చాలనీ కోరింది. “2000 నుండి…

బుద్ధిలేనితనం, అత్యాశ, నిర్లక్ష్యం… ఇవే ఆర్ధిక సంక్షోభాలకు కారణం -గీధనర్

బుద్ధిలేనితనం (stupidity), అత్యాశ (greed), నిర్లక్ష్యం (recklesness) వల్లనే ఆర్ధిక సంక్షోభాలు సంభవిస్తున్నాయని అమెరికా ట్రెజరీ సెక్రటరీ తిమోతి గీధనర్ స్పష్టం చేశాడు. ఆర్ధిక ప్రమాదాలను అవలీలగా తీసుకోవడం తగదని హెచ్చరించాడు. మోసాలనూ, చట్టాల దుర్వినియోగాన్నీ అడ్డుకోవడానికి కఠినమైన చట్టాలు తప్పనిసరని గీధనర్ నొక్కి చెప్పాడు. పోర్ట్ లాండ్ సిటీ క్లబ్ లో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ గీధనర్ బుధవారం ఈ మాటలన్నాడు. వాల్ స్ట్రీట్ లోని బడా బడా ద్రవ్య కంపెనీలు లాభాల పేరాశతో ప్రమాదకరమైన…

త్వరగా సంస్కరణలు ఆమోదించండి, మాకోసం మీ మార్కెట్లు పూర్తిగా తెరవండి -అమెరికా

ఇండియా సంస్కరణల అమలు వేగవంతం చెయ్యాలనీ, తద్వారా భారత మార్కెట్లను అమెరికా ప్రవేశించడానికి వీలుగా మరింత బార్లా గేటులు తెరవాలని అమెరికా కోరింది. అమెరికా ట్రెజరీ సెక్రటరీ తిమోతి గీధనర్ వాషింగ్టన్‌లో జరుగుతున్న ఇండియా అమెరికా బిజినెస్ ఫోరంలో మాట్లాడుతూ ఇండియా ఫైనాన్షియల్ మార్కెట్‌ను బాగా అభివృద్ధి చేసుకుందని సర్టిఫికెట్ ఇచ్చాడు. మరిన్ని సంస్కరణలు ప్రవేశ పెట్టినట్లయితే ఇండియాలో కాపిటల్ మార్కెట్లు అభివృద్ధి చెంది అమెరికా కంపెనీలు స్వేచ్ఛగా ప్రవేశించడానికి వీలు కలుగుతుందని గీధనర్ తెలిపాడు. సమావేశానికి…