ఆఫ్ఘన్ పై పట్టు: రేసులో అమెరికా ముందంజ (ఇప్పటికి!)
తన భౌగోళిక రాజకీయ ప్రయోజనాల కోసం ఎలాంటి అడ్డదారి తొక్కడానికైనా అమెరికా ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. రొయ్యలు ఒంటికి మంచిది కాదని ఊరంతా నీతులు చెప్పి రొయ్యల బుట్ట తానే మాయం చేసేసి లొట్టలు వేస్తూ భుజిస్తుంది. ఈ సంగతి మరోసారి రుజువు చేసుకుంది అమెరికా. ఎవరికీ చెప్పా పెట్టకుండా, కనీసం సంకేతాలు కూడా ఇవ్వకుండా తాలిబాన్ కు నిధులు అందించే మార్గాన్ని అమెరికా తెరిచి పట్టుకుంది. తద్వారా ఆఫ్ఘనిస్తాన్ దేశం ఆర్ధిక మూలాలు తన చేతుల్లో…