తాలిబాన్ సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటానికి మద్దతు ఎందుకివ్వాలి?
(గత మలాల యూసఫ్జాయ్ ఆర్టికల్ కింద వ్యాఖ్యాత చక్రిగారు ఒక కొత్త కోణాన్ని పాఠకుల ముందు ఉంచారు. ‘వర్టికల్ మరియు హారిజాంటల్ సమస్య’ అనే దృష్టి కోణంలో తాను సమస్యను చూస్తున్నట్లు చెప్పారు. సామాజిక విశ్లేషణల్లోనే కాక ప్రజలతో సంబంధం ఉన్న అనేక ఇతర సమస్యల విశ్లేషణలో కూడా కొందరు ఈ కోణాన్ని తరచుగా ప్రస్తావిస్తారు. ఈ కోణంలో చూసినపుడు వ్యవస్ధాగత సమస్యలు కొంత తేలికగా అర్ధం అయే అవకాశం ఉంటుంది. తన దృష్టిలో ఏది వర్టికల్,…