మా రక్షణ కోసం మేం ఏమైనా చేస్తాం, పాక్‌కు అమెరికా హెచ్చరిక

పాకిస్ధాన్‌కి అమెరికా తాజాగా హెచ్చరిక జారీ చేసింది. తాలిబాన్ మిలిటెంట్లు ఆఫ్ఘన్ రాజధాని కాబూల్ నడిబొడ్డున ఉన్న అమెరికా ఎంబసీ, నాటో కార్యాలయం ఉన్న ప్రాంతంపైన రాకెట్లు, మెషిన్ గన్‌లతో దాడి చేసింది. మంగళవారం మధ్యాహ్నం నుండి బుధవారం ఉదయం వరకు ఇరవై గంటలపాటు సాగిన ఈ దాడిలో పెద్దగా నష్టం ఏమీ జరగనప్పటికీ, అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు ఉండే ‘హై సెక్యూరిటీ జోన్’ లోకి రాకెట్ ప్రొపెల్డ్ గ్రెనేడ్స్, మెషిన్ గన్లతో సహా మిలిటెంట్లు…

మానసిక యుద్ధంలో భాగమే అమెరికా ఎంబసీపై తాలిబాన్ దాడి

20 గంటల పోరాటం అనంతరం తాలిబాన్ దాడి ముగిసింది. దాడిలో పాల్గొన్న తాలిబాన్ మిలిటెంట్లు అందరూ చనిపోవడంతో ఆపరేషన్ ముగిసింది. మంగళవారం ఆఫ్ఘన్ రాజధాని కాబూల్‌లో ‘అత్యున్నత భద్రతా జోన్’ లో తాలిబాన్ మిలిటెంట్లు దాడికి పూనుకున్న సంగతి విదితమే. అమెరికా ఎంబసీకి సమీపంలోనే ఉన్న ఒక నిర్మాణంలో ఉన్న భవంతిని అదుపులోకి తీసుకున్న తాలిబాన్ మిలిటెంట్లు బుధవారం వరకూ ఇరవై గంటలపాటు ఆఫ్ఘన్, అమెరికన్ సైనికుల ప్రతిఘటనను ఎదుర్కొని నిలబడ్డారు. దాడిలో భారీ ఆయుధాలు ఏవీ…