ఇండియాతో చర్చలు: మండుతున్న పాకిస్ధాన్ -కార్టూన్

“… జనాబ్ మోడీజీ, మీతో సంబంధాలు మెరుగుపరుచుకోవటానికి మేము గీత దాటితిమి. ఇప్పుడు చూడండి ఏం జరుగుతోందో…” *** ప్రస్తుతం పాకిస్ధాన్ రాజధాని ఇస్లామాబాద్, ముఖ్యంగా పార్లమెంటు ప్రాంతం ఆందోళనలతో రగులుతోంది. ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని పార్టీ, మరో మతగురువు నేతృత్వంలోని సంస్ధ రెండూ పాకిస్ధాన్ పార్లమెంటు మీదికి దండెత్తి వచ్చారు. తమ ఆందోళనకు వారు చెబుతున్న కారణం నవాజ్ షరీఫ్ ప్రభుత్వం రిగ్గింగ్ చేసి అధికారంలోకి వచ్చిందని. అక్రమ ప్రభుత్వం కనుక వెంటనే రాజీనామా చేసి…

పాక్‌లో మళ్ళీ అధికార కుస్తీలు, సూఫీ గురువు వెనుక దాగిన మిలట్రీ?

సూఫీ గురువు తాహిర్-ఉల్-ఖాద్రి కెనడా నుండి పాకిస్థాన్ లోకి తిరిగి ప్రవేశించినప్పటినుండీ అక్కడ అధికార కుమ్ములాటలు తారా స్థాయికి చేరాయి. పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం రాజీనామా చేయాలనీ, మే నెలలో జరగనున్న ఎన్నికలను వాయిదా వేయాలనీ ఖాద్రి ఒకవైపు డిమాండ్ చేస్తుండగా, మరో వైపు పాకిస్థాన్ ప్రధాని రాజా పర్వేజ్ అష్రాఫ్ పై వచ్చిన అవినీతి ఆరోపణల నేపధ్యంలో ఆయనను అరెస్టు చేయాలని సుప్రీం కోర్టు మంగళవారం ఆదేశాలిచ్చిందని ఫస్ట్ పోస్ట్ తెలిపింది .…