క్లుప్తంగా… 09/06/2016

చైనా అప్పు అమెరికా ఎగవేయొచ్చు జాగ్రత్త! మహిళలపై అమానుషాన్ని ఆపండి -ఐర్లండ్ తో ఐరాస ఉద్తా పంజాబ్ లో తప్పేముంది? -బొంబే హై కోర్ట్ రేపిస్టుని క్షమించి వదిలేయి, ప్లీజ్ చైనా అప్పు అమెరికా ఎగవేయొచ్చు జాగ్రత్త! ఇది బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ (బ్రిటన్ సెంట్రల్/రిజర్వ్ బ్యాంక్) మాజీ గవర్నర్ మెర్విన్ కింగ్ చేసిన హెచ్చరిక! “భవిష్యత్తులో ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు? కానీ తమ విదేశీ ఆస్తులు అన్నీ అమెరికాపైనే ఆధారపడి ఉండటం చైనా తదితర…

ఇది రేప్ నెంబర్ 2 -అరుంధతి రాయ్

(తెహెల్కా ఎడిటర్ తరుణ్ తేజ్ పాల్ ఉదంతంపై ఔట్ లుక్ పత్రికకు అరుంధతి రాయ్ రాసిన ఆర్టికల్ కు ఇది యధాతధ అనువాదం. -విశేఖర్) ఇండియా ఇంక్ (India Ink) భాగస్వాముల్లో తరుణ్ తేజ్ పాల్ ఒకరు. నా నవల ‘ద గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్’ ను మొదట ప్రచురించిన పబ్లిషింగ్ కంపెనీ ఇదే. ఇటీవలి ఘటనలపైన స్పందించమని నన్ను అనేకమంది జర్నలిస్టులు కోరారు. మీడియా సర్కస్ పెద్ద పెట్టున ఊళపెడుతున్న నేపధ్యంలో  ఏదన్నా చెప్పడానికి…

తెహెల్కాకు సోమా చౌదరి రాజీనామా!

మరో అనూహ్య పరిణామం! తెహెల్కా రధానికి ఇప్పుడు సారధి కూడా లేరు. యుద్ధం చేయాల్సిన వ్యక్తే విల్లమ్ములను బొంద పెట్టడంతో ఇప్పటికే బోసిపోయిన రధం సోమా చౌదరి రాజీనామాతో సారధి కూడా కరువై ఒంటరిగా మిగిలింది. అద్వితీయ కధనాలతో చెలరేగిపోయిన తెహెల్కా రధం ఇప్పుడు యుద్ధ వీరుడూ, సారధీ ఇద్దరూ లేక వెలతెలా పోతోంది. అన్నివైపుల నుండి విమర్శలు చుట్టుముట్టడంతో తన ఉనికి పత్రికకు నష్టమో, లాభమో తానే తేల్చుకోలేకుండా ఉన్నానని చెబుతూ సోమా చౌదరి తన…

అన్ని దారులూ తేజ్ పాల్ వ్యతిరేక దిశలోనే…

కొన్ని పరిణామాలను గమనిస్తే, ‘టైమ్’ గురించి పెద్దల పేరుతో జనం చెప్పుకునే మాటలు నిజమేనేమో అని భ్రమింపజేస్తాయి. జరిగిన ఘటన పూర్వాపరాల సమాచారం లేకపోయినా, లేదా అందుబాటులో ఉన్న సమాచారం పైన సంయక్ దృక్పధం లోపించినా ఈ ‘టైమ్’ ట్రాప్ లో పడిపోవడం ఖాయం. ప్రస్తుతం తరుణ్ తేజ్ పాల్ విషయంలో జరుగుతున్న పరిణామాల విషయంలో ‘టైమ్ ఫ్యాక్టర్’ ని దోషిగా తెస్తున్నవారిని చూస్తే ఇదే అనిపిస్తుంది. నిన్న మొన్నటి దాకా ‘పట్టిందల్లా బంగారమే, కన్ను కుట్టిందల్ల…

హలో తెహెల్కా! ఏమిటీ పని?

తెహెల్కా ఎడిటర్-ఇన్-చీఫ్ తరుణ్ తేజ్ పాల్ వ్యవహారంలో దృశ్యాలు శరవేగంగా మారుతున్నాయి. తెహెల్కా పత్రిక గోవాలో జరిపిన ‘THiNK ఫెస్టివల్’ సందర్భంగా తమ పత్రికలో పని చేసే ఒక యువ మహిళా జర్నలిస్టుపై లైంగిక అత్యాచారం జరపిన ఆరోపణలు రావడంతో పత్రికా ప్రపంచంతో పాటు అనేకమంది నిర్ఘాంతపోయారు. అణచివేతకు గురవుతున్న వర్గాల తరపున పని చేయడంలో ప్రశంసాత్మక కృషి చేసిన తెహెల్కా ఎడిటర్ తాను కూడా మురికిలో భాగం అని ప్రకటించుకున్న సందర్భం అభ్యుదయ కాముకలను తీవ్రంగా…

క్లుప్తంగా… 21.11.2013

అమెరికా-ఆఫ్ఘన్ ఒప్పందం కుదిరింది ఆఫ్ఘన్ అధ్యక్షుడు హమీద్ కర్జాయ్ ను దారికి తెచ్చుకోడంలో అమెరికా సఫలం అయింది. 2024 వరకు అమెరికా సైన్యాలు ఆఫ్ఘనిస్ధాన్ లో కొనసాగడానికి ఉద్దేశించిన ఈ ఒప్పందంపై ఒక అంగీకారం కుదిరిందని అమెరికా విదేశీ మంత్రి జాన్ కెర్రీ ప్రకటించాడు. గత 24 గంటల్లో జాన్ కెర్రీ రెండు సార్లు ఆఫ్ఘన్ అధ్యక్షుడు కర్జాయ్ కు ఫోన్ చేశారని, కర్జాయ్ అనుమానాలను కెర్రీ నివృత్తి చేసిన ఫలితంగా ఒప్పందం సాధ్యమయిందని తెలుస్తోంది. అమెరికా…