డీఎంకే సహకారంతో పళనిస్వామి విశ్వాస తీర్మానం గెలుపు

శశికళ ముఖ్యమంత్రిగా ఎంపిక చేసిన ఈపిఎస్ (E పళనిస్వామి) విశ్వాస తీర్మానం నెగ్గాడు. ‘న్యాయం గెలుస్తుంది. మేమే ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం’ అంటూ బింకం ప్రదర్శించిన ఓపిఎస్ చివరికి బిక్క మొహం వేశాడు. ఈపిఎస్ ప్రభుత్వానికి అనుకూలంగా 122 మంది ఎంఎల్ఏ లు ఓటు వేయగా వ్యతిరేకంగా కేవలం 11 మంది ఎంఎల్ఏలు మాత్రమే ఓటు వేశారు. జయలలిత ఓటు లేదు కనుక ప్రభుత్వ ఏర్పాటుకు 117 మంది ఎంఎల్ఏలు మద్దతు చాలు.      …

శశికళ దోషిగా నిర్ధారణ, మోడీ రాజకీయానికి గెలుపు

శశికళ నటరాజన్ కలలు కల్లలయ్యాయి. కళ్ళ ముందు ఊరిస్తూ కనిపించిన ముఖ్య మంత్రి పీఠం ఆమెకు దూరం అయిపొయింది. నోటి కాడ ముద్ద చెల్లా చెదురయింది. ముఖ్య మంత్రి కార్యాలయానికి బదులు ఆమె జైలుకు వెళ్లాలని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. కర్ణాటక హై కోర్టు తీర్పును పక్కనబెట్టి ట్రయల్ కోర్టు తీర్పును సుప్రీం కోర్టు సమర్ధించింది. తమిళనాడులో అయితే సాక్షులను జయలలిత ప్రభావితం చేస్తుందన్న పిటిషనర్ల విన్నపం దరిమిలా జయలలిత, శశికళ నటరాజన్, ఇళవరసి, సుధాకరన్…

తమిళనాట మళ్ళీ వరదలు! -కార్టూన్

అబ్బే ఆ వరదలు కాదు లేండి! ఇదో కొత్త రకం వరద! ఒపీనియన్ పోల్స్ లో జయలలితకు వ్యతిరేకంగా మొగ్గు ఉన్నట్లు తేలడంతో ఆమె వాగ్దానాల వర్షం కురిపిస్తున్నారు. కాదు కాదు, వరద పారిస్తున్నారు. మచ్చుకు కొన్ని వాగ్దానాలు చూడండి. ఈ వరద విద్యలో ప్రస్తుతానికి జయలలిత గారిదే పై చేయి. ప్రతి రెండు నెలలకీ ఒక్కో యింటికి 100 యూనిట్ల ఉచిత విద్యుత్, ఆటంకం (కోతలు) లేని విద్యుత్ మహిళలు స్కూటర్లు కొనడానికి 50% సబ్సిడీ…

జయలలిత కేసు: 10 శాతం అక్రమ ఆస్తులు ఉండొచ్చు!

అక్రమ ఆస్తుల కేసులో నిర్దోషిగా జయలలిత బైటకు వచ్చేశారు. ఇప్పుడామె మళ్ళీ ఎన్నికల్లో గెలిచినంత సంబరాలు తమిళనాడులో జరుగుతున్నాయి. ఈ సంబరాల్లో జయలిత అభిమానులు మునిగిపోతే ఆశ్చర్యపడవలసింది ఏమీ లేదు. దేశంలోని ప్రధాన రాజకీయ పార్టీల నేతలంతా, చివరికి సి.పి.ఐతో సహా, జయలలిత అభిమానుల ఆనందంలో భాగం పంచుకోవడమే విచిత్రం. ప్రధాని మోడి సైతం ఆమెకు అభినందనలు తెలిపారట! ట్రయల్ కోర్టు తీర్పును కొట్టివేస్తూ కర్ణాటక హై కోర్టు ఇచ్చిన తీర్పు ఒక వింత సంగతిని బైటికి…

తమిళనాడా, జయలలితా? -కార్టూన్

తమిళనాడు ప్రజల పురచ్చి తలైవి జైలు పాలు కావడంతో ఆమె నియమించిన మంత్రివర్గం రాజీనామా చేసింది. జయలలితకు నమ్మినబంటుగా పేరు పడి సరిగ్గా ఇలాంటి సందర్భంలోనే ముఖ్యమంత్రి పీఠాన్ని ఒకసారి అధిష్టించి జయలలిత విడుదల కాగానే తిరిగి ఆమె పీఠాన్ని ఆమెకు అప్పగించిన పన్నీర్ సెల్వం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు కొత్త మంత్రివర్గమూ కొలువుతీరింది. పేరుకు కొత్త మంత్రివర్గమే గానీ పాత మంత్రివర్గాన్నే పన్నీర్ సెల్వం కొనసాగించారు. ప్రమాణ స్వీకారం సందర్భంగా మంత్రులు,…

మాన్యుఫాక్చరింగ్: బి.జె.పి యేతర రాష్ట్రాలదే పై చేయి

బి.జె.పి ప్రధాని అభ్యర్ధి నరేంద్ర మోడి తరచుగా అభివృద్ధి మంత్రం జపిస్తుంటారు. స్వదేశీ, విదేశీ ప్రైవేటు కంపెనీలకు ఇష్టానుసారం జనం సొమ్ము కట్టబెట్టడమే అభివృద్ధి మంత్రంలోని అంతస్సారం. పోనీ అందులోనైనా గుజరాత్ ముందు పడిందా అంటే అదీ లేదు. కాంగ్రెస్, బి.జె.పి రెండు పార్టీలూ లేని తమిళనాడు మాన్యుఫాక్చరింగ్ ఉత్పత్తి, ఉద్యోగాల సృష్టి లలో అన్ని రాష్ట్రాల కంటే ముందంజలో ఉండని సెంట్రల్ స్టాటిస్టికల్ ఆఫీస్ వారి గణాంకాలు తెలియజేస్తున్నాయి. బి.జె.పి తన ఎన్నికల ప్రచారంలో మాన్యుఫాక్చరింగ్,…

తమిళనాట కులాల కాలకూట విషం విరజిమ్ముతున్న పి.ఎం.కె

కుల దురభిమానమే పెట్టుబడిగా స్వార్ధ ప్రయోజనాలను నెరవేర్చుకోవడానికి సిద్ధపడిన డాక్టర్ ఎస్.రాందాస్ తమిళనాడులో కులాల కాలకూట విషాన్ని విరజిమ్ముతున్నాడు. అవకాశం వచ్చినప్పుడల్లా, అది రాకపోతే సృష్టించుకుని మరీ అమాయక పేద ప్రజల మధ్య చిచ్చు రగుల్చుతున్నాడు. ‘చిత్ర పౌర్ణమి’ యూత్ ఫెస్టివల్ పేరుతో ఏప్రిల్ 25 తేదీన రాందాస్ నేతృత్వంలోని ‘పట్టలి మక్కల్ కచ్చి’ (పి.ఎం.కె) పార్టీ నిర్వహించిన వన్నియార్ ‘కుల పండగ’ దళితుల రక్తాన్ని మరోసారి చిందించింది. గంధపు చెక్కల స్మగ్లర్ గా రెండు రాష్ట్రాల…

శ్రీలంక కాకి తమిళనాడుపై ఎగరకూడదు మరి! -కార్టూన్

నేను చెప్పానా? తమిళనాడు పైన ఎగరకపోతేనే మంచిదని….! శ్రీలంక తో భారత దేశానికి ఉన్న ప్రతి సంబంధాన్నీ రాక్షసీకరించే ప్రయత్నాలు తమిళనాడులో జోరుగా సాగుతున్నాయి. రాజకీయ పార్టీలు ఒకరితో ఒకరు పోటీలు పడుతూ తమిళ జాతీయవాదంలో తామే నిఖార్సయినవారమని చెప్పడానికి అసలు సమస్యే కానీ అంశాలని పెద్ద సమస్యలుగా చేస్తున్నారు. ఎల్.టి.టి.ఇ తో పోరులో చివరి రోజుల్లో శ్రీలంక ప్రభుత్వం ఆదేశాల మేరకు తమిళ పౌరులపై సాగిన నరమేధం గురించి నిర్దిష్ట అవగానను ఇంతవరకూ ఈ పార్టీలేవీ…

ప్రభుత్వాల ఉదాసీనత ఫలితం, తమిళనాడులో శ్రీలంక యాత్రీకులపై దాడులు

శ్రీలంక తమిళుల పరిస్ధితిపై కేంద్ర ప్రభుత్వ ఉదాసీనత, తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వ రెచ్చగొట్టే ప్రకటనలు వెరసి శ్రీలంక యాత్రీకులపై విద్వేషపూరిత దాడులు జరుగుతున్నాయి. తమిళనాడు దేవాలయాలను సందర్శించడానికి శ్రీలంక నుండి వచ్చిన యాత్రీకులు మధ్యలోనే ప్రయాణం ముగించుకుని భయాందోళనలతో తిరుగు ప్రయాణం కట్టారు. తమిళనాడు సందర్శనకు వ్యతిరేకంగా శ్రీలంక ప్రభుత్వం ‘ట్రావెల్ అడ్వైజరీ’ కూడా జారీ చేయవలసిన పరిస్ధితి తలెత్తింది. తమిళనాడు తమిళులనుండి రాళ్ళు, చెప్పుల దాడిని ఎదుర్కొన్న యాత్రికులలో శ్రీలంక తమిళులే మెజారిటీ కావడం జాతి…