దళిత పెళ్ళి కొడుకు గుర్రం ఎక్కితే రాళ్ళు పడతాయ్!
రిజర్వేషన్లు ఇంకానా? అని ప్రశ్నించే అమాయకోత్తములకు తామున్న బావి నుండి బైటికి వచ్చి లోకం చూడాలని పిలుపు ఇచ్చే ఘటన ఇది! దళిత కులానికి చెందిన ఓ పెళ్లి కొడుకు గుర్రం ఎక్కి ఊరేగేందుకు వీలు లేదని శాసించిన ఉన్నత కులాలు తమ శాసనాన్ని మీరినందుకు రాళ్ళతో దాడి చేశారు. గుర్రాన్ని లాక్కెళ్ళారు. మరో గుర్రం తెచ్చుకున్న పెళ్లి కొడుకు రక్షణ కోసం పోలీసులు అతని తలకి హెల్మెట్ తొడగడం బట్టి దేశంలో కుల రక్కసి ఇంకా…