మీ దాష్టీకం యూ‌పిలో చెల్లవచ్చేమో, ఇక్కడ కాదు -యూ‌పి పోలీసుల్తో ఢిల్లీ హై కోర్టు

ఉత్తర ప్రదేశ్ పోలీసులకి ఢిల్లీ హై కోర్టు గడ్డి పెట్టింది. మతాంతర వివాహాలకు వ్యతిరేకంగా అత్యంత అప్రజాస్వామిక చట్టం చేయడమే కాకుండా సదరు చట్టం పేరుతో విచక్షణారహితంగా వివాహితులను వారి కుటుంబ సభ్యులను అరెస్టులు చేసి జైళ్ళలో తోస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్న యూ‌పి ప్రభుత్వానికి కూడా ఢిల్లీ హై కోర్టు పరోక్షంగా జ్ఞాన బోధ చేసింది. “ఇక్కడ ఢిల్లీలో మీ చర్యలు చెల్లబోవు. ఎలాంటి చట్ట వ్యతిరేక చర్యలైనా సరే చెల్లవు. ఢిల్లీ నుండి జనాన్ని…

పూర్తి స్ధాయి రాష్ట్రం కాదు -ది హిందూ ఎడిట్ (విమర్శ)

(True translation to today’s The Hindu editorial: Not a full-fledged state) ********* ఢిల్లీ కేవలం కేంద్ర పాలిత ప్రాంతం మాత్రమే అని స్పష్టం చేయడం ద్వారా ఢిల్లీ హై కోర్టు, జాతీయ రాజధాని ప్రాంతం (నేషనల్ కేపిటల్ రీజియన్) యొక్క రాజ్యాంగ ప్రతిపత్తికి సంబంధించిన కొన్ని ప్రధాన మరియు అపరిష్కృత ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చింది. రాజ్యాంగం లోని ఆర్టికల్ ౨౩౯ రాష్ట్ర మంత్రివర్గంతో సంబంధం లేకుండా ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ స్వతంత్రంగా వ్యవహరించడానికి…

ఢిల్లీ కోర్టు రూలింగ్: మోడిపై ఎఎపి గెలుపు

ఒక హెడ్ కానిస్టేబుల్ అవినీతి కేసులో ఢిల్లీ హై కోర్టు ఇచ్చిన తీర్పు ద్వారా ఢిల్లీలోని ఎఎపి ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి మధ్య జరుగుతున్న యుద్ధంలో ఎఎపి మొదటి గెలుపు నమోదు చేసింది. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ ద్వారా ఎఎపి ప్రభుత్వం చేతుల్లో నుండి అధికారాలు గుంజుకోవడానికి గత కొద్ది వారాలుగా మోడి ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఈ ప్రయత్నాలకు ఢిల్లీ హై కోర్టు ఇచ్చిన తాజా తీర్పు కళ్ళెం వేసింది. ఢిల్లీ పోలీసులపై…