ప్రధాని మోడి డిగ్రీ, PG ఫోర్జరీ?!

బి‌జే‌పి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఓ పక్క సోనియాను టార్గెట్ చేసుకోగా, ఢిల్లీ ముఖ్యమంత్రి నేరుగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడిని టార్గెట్ చేసుకున్నారు. మానవ వనరుల మంత్రి స్మృతి ఇరానీ విద్యార్హతలు ఏమిటో కోర్టులు ఇతమిద్ధంగా ఏమి తేల్చలేదు. BA అని ఒక ఎన్నికల్లోనూ, B Com ఫస్ట్ ఇయర్ అని మరో ఎన్నికల్లోనూ అఫిడవిట్ లో రాయడం బట్టి స్మృతి ఇరానీ గ్రాడ్యుయేషన్ పూర్తి చేయలేదని స్పష్టం అయింది. కానీ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసే…

అమెరికా నిఘాపై పిటిషన్ స్వీకరించిన సుప్రీం కోర్టు

భారత ప్రజల వ్యక్తిగత వివరాలను అక్రమంగా సేకరిస్తూ, వారి రోజువారీ సంభాషణలపై నిఘా పెడుతున్న అమెరికా పైన భారత సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్ కు అర్జెంటు హియరింగ్ ఇవ్వడానికి సుప్రీం కోర్టు అంగీకరించింది. అమెరికా మిలట్రీ గూఢచార సంస్ధ ఎన్.ఐ.ఏ భారతీయుల ఇంటర్నెట్ కార్యకలాపాల డేటాను ‘ప్రిజమ్’ అనే ప్రత్యేక ప్రోగ్రామ్ ద్వారా సేకరించడానికి ఇంటర్నెట్ కంపెనీలు అంగీకరించడం వలన భారత జాతీయ భద్రతకు ప్రమాదం పొంచి ఉందని పిటిషనర్ ఆరోపించారు. ఢిల్లీ…

మానవత్వం లేని కాలేజీలు

ఢిల్లీ యూనివర్శిటీ పరిధిలోని కొన్ని కాలేజీల తీరిది. అంగవైకల్యాన్ని జయించడానికి శ్రమిస్తున్న సాటి మనుషులకు తోడు నిలిచి భుజం తట్టడానికి బదులు యధాశక్తి అడ్డంకులు సృష్టిస్తున్న కాలేజీలు దేశ రాజధానిలోనే కొలువుదీరి ఉన్నాయి. తమ తరపున పరీక్ష రాయడానికి తోడు తెచ్చుకున్నవారిని నిర్దాక్షిణ్యంగా బైటికి తరిమికొట్టి, ఓ అంధ విద్యార్ధి పరీక్షలో తప్పడానికి సిద్ధపడిన కాలేజీ ఒకటైతే రైటర్ ని ఆలస్యంగా అందించడమే కాక కొశ్చేన్ పేపర్ కి పూర్తి సమాధానం ఇవ్వడానికి ఒక్క నిమిషం కూడా…