ఢిల్లీ అసెంబ్లీ: కాంగ్రెస్ కి షీలా షాక్!

కాంగ్రెస్ పార్టీ తరపున ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వానికి 3 సార్లు ముఖ్యమంత్రిగా పని చేసిన షీలా దీక్షిత్ ఈ రోజు (సెప్టెంబర్ 11, 2014) రాజకీయ పరిశీలకులను, పత్రికలను, ఢిల్లీ ప్రజలను నిశ్చేష్టులను కావించారు. ఢిల్లీలో బి.జె.పి ప్రభుత్వం ఏర్పాటు చేస్తే అది ఢిల్లీ ప్రజలకు మంచిదే అని ఆమె వ్యాఖ్యానించారు. ఆమె ప్రకటనతో తమకు సంబంధం లేదని కాంగ్రెస్ ప్రకటించగా, కాంగ్రెస్-బి.జె.పి లకు అసలు తేడాయే లేదని చెప్పాం గదా! అని ఎఎపి వ్యాఖ్యానించింది. “ప్రజాస్వామ్యంలో,…

అరవింద్: తానొకటి తలచిన కోర్టు మరొకటి తలచెను

ఆమ్ ఆద్మీ పార్టీ/అరవింద్ కేజ్రీవాల్ పరిస్ధితి ఇప్పుడు కుడితిలో పడ్డ ఎలుకలా మారింది. ఢిల్లీలో మళ్ళీ ఎన్నికలు జరిపించాలన్న లక్ష్యంతో తాము వేసిన పిటిషన్ చివరికి బి.జె.పి ప్రభుత్వం ఏర్పాటుకు దారితీయబోతోంది. అరవింద్ వెల్లడి చేసిన వీడియో దృష్ట్యా ఢిల్లీలో ఎంత త్వరగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తే అంత మంచిదని సుప్రీం కోర్టు ఈ రోజు వ్యాఖ్యానించింది. దానితో పిటిషన్ వేసిన లక్ష్యం నెరవేరకుండా పోతోంది. తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా ఎన్.డి.ఏ ప్రభుత్వం ఆమోదించిన జస్టిస్ హెచ్.ఎల్.దత్తు…

అరవింద్: తోడేళ్ళకు భయపడే మేకల కాపరి -కార్టూన్

ఢిల్లీ ప్రభుత్వం ఏర్పాటుపై మళ్ళీ కదలిక మొదలు కావడంతో ఎఎపి నేత అరవింద్ కేజ్రీవాల్ కు పెద్ద చిక్కొచ్చిపడింది. తమ ఎమ్మెల్యేలను కాపలా కాసే కాపరిగా ఆయనకు కొత్త బాధ్యతలు వచ్చిపడ్డాయి. శాసనసభలో అతి పెద్ద పార్టీకి ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఇవ్వాలని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ రాష్ట్రపతికి సఫారసు చేస్తూ అందుకు అనుమతి ఇవ్వాలని కోరడంతో ఎఎపి నేతకు ఈ అదనపు బాధ్యతలు వచ్చిపడ్డాయి. ఈ కార్టూన్ కి రెండు అర్ధాలు చెప్పుకోవచ్చు. ఒకటి:…

పత్రికల ఆక్రమణదారు కేజ్రీవాల్ -కార్టూన్

“ఆయన మా చోటు ఆక్రమించుకున్నాడు. వెంటనే ఖాళీ చేయమని చెప్పండి.” – తరచుగా పత్రికల్లో చోటు సంపాదించడం కొందరికే సాధ్యం అవుతుంది. ముఖ్యంగా కార్టూన్ లలో చోటు సంపాదించాలంటే వివిధ కళల్లో నిష్ణాతులై ఉండాలి. రాజకీయ కళ అందరు రాజకీయ నాయకులు ప్రదర్శించేదే. కానీ వారిలో కూడా ప్రత్యేక తరహాలో రాజకీయాలు చేయగలిగితేనే కార్టూనిస్టుల దృష్టిని ఆకర్షించగలరు. ప్రస్తుతం ఇలా కార్టూనిస్టులను ఆకర్షించే ప్రత్యేక కళలో ఎఎపి నేత అరవింద్ కేజ్రీవాల్ ఆరితేరారని, పాత నిష్ణాతులకు కలవరం…

ఢిల్లీ రాష్ట్ర పీఠం – మ్యూజికల్ చైర్ -కార్టూన్

ఢిల్లీ రాష్ట్రంలో ఓ విచిత్రమైన పరిస్ధితి నెలకొంది. నిజమైన హంగ్ అసెంబ్లీ అంటే ఇదేనా అన్నట్లుగా ఉండడం ఈ విచిత్రంలో ఒక భాగం. ఇంతకు ముందు హంగ్ అసెంబ్లీ లేదా హంగ్ పార్లమెంట్ అనేకసార్లు ఏర్పడినా ప్రస్తుతం ఢిల్లీలో వచ్చిన పరిస్ధితి లాంటిది ఎప్పుడూ ఉద్భవించిన దాఖలా లేదు. గతంలో హంగ్ అసెంబ్లీ అన్నా, హంగ్ పార్లమెంటు అన్నా రాజకీయ సంక్షోభం గానీ రాజ్యాంగ సంక్షోభం గానీ ఉండేది కాదు. అంటే: ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ…