నిర్భయ: నిందితులందరికీ ఉరి
నిర్భయ హంతకులు నలుగురుకి సత్వర న్యాయస్ధానం (fast-track court) ఉరిశిక్ష విధించింది. జరిగిన ఘోరం ఖచ్చితంగా అరుదయిన కేసుల్లోకెల్లా అరుదైనదేనని కనుక నిందితులకు మరణ శిక్షే సరైనదనీ న్యాయస్ధానం తీర్పు చెప్పింది. తీర్పు విన్న వెంటనే నిర్భయ తల్లిదండ్రులు, సోదరులు హర్షాతిరేకాలు ప్రకటించారు. తమ కూతురికి న్యాయం దక్కిందని చెబుతూ, తమ వెన్నంటి నిలిచిన దేశ ప్రజలకు, మీడియాకు కృతజ్ఞతలు తెలిపారు. తీర్పు ప్రకటించిన తర్వాత నిందితుల్లో ఒకరు ఏడుపు మొదలు పెట్టగా, ఇతరులు తమ పాపాన్ని…