బేసి-సరి అమలు: ఒక పరిశీలన
కేజ్రీవాల్ ప్రభుత్వం అమలు చేస్తున్న బేసి-సరి పధకం వల్ల ఢిల్లీలో కాలుష్యం తగ్గిందా లేదా అన్నది కేవలం ఒక్క ప్రశ్న మాత్రమే. కావాలంటే దానికీ సమాధానం చెప్పుకుందాం, ఉందో లేదో అని! ఢిల్లీ ప్రభుత్వం స్వల్పంగా కాలుష్యం తగ్గింది అని చెబుతోంది. కాదు.., స్వల్పంగా కూడా తగ్గలేదు అని కొందరు విశ్లేషకులు చెబుతున్నారు. ప్రభుత్వం భావిస్తున్నంతగా తగ్గలేదు కావచ్చు కూడా. ఎందుకంటే… 2013లో కాన్పూర్ ఐఐటి వారు ఢిల్లీలో సర్వే మరియు పరీక్షలు నిర్వహించారు. ఢిల్లీ గాలిలో…