బడ్జెట్ 2015-16 పై ఢిల్లీ దెబ్బ -కార్టూన్
ఢిల్లీ ఎన్నికల ముందు వరకూ ప్రధాని నరేంద్ర మోడి నోట సంస్కరణల మాటలు తప్ప మరొకటి వినపడలేదు. సంస్కరణలు తీవ్రం చేసి ఆర్ధిక వ్యవస్ధకు ఊపు తేవడం పైనే ఆయన ప్రసంగాలు, పర్యటనలు, ప్రకటనలు కేంద్రీకృతం అయ్యాయి. ఆయన పైన కార్పొరేట్ వర్గాలు కూడా గంపెడు ఆశలు పెట్టుకుని బడ్జెట్ 2015-16 కోసం ఆత్రంగా ఎదురు చూశారు. మోడి ప్రభుత్వం ‘బిగ్ బ్యాంగ్’ తరహాలో స్వదేశీ, విదేశీ పెట్టుబడి వర్గాలకు, ఇతర సంపన్నులకు మోత మోగించే వరాలు…