ఉక్రెయిన్: రష్యా హఠాత్ నిర్ణయం!
ఉక్రెయిన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తలపడుతున్న తూర్పు ఉక్రెయిన్ ప్రాంతాల విషయంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ సోమవారం హఠాత్తుగా ఎవరూ ఊహించని నిర్ణయం ప్రకటించాడు. తమను తాము స్వతంత్ర రిపబ్లిక్ లు గా ప్రకటించుకున్న డోనెట్స్క్, లుగాన్స్క్ (లేదా లుహాన్స్క్) లను స్వతంత్ర రాజ్యాలుగా గుర్తిస్తున్నట్లు ప్రకటించాడు. తలవని తలంపుగా వెలువడిన ఈ ప్రకటనకు ఎలా స్పందించాలో అర్ధం కాని అయోమయంలో అమెరికా తదితర పశ్చిమ రాజ్యాలు పడిపోయినట్లు కనిపిస్తున్నాయి. ఉక్రెయిన్ పై దాడి చేస్తే తీవ్రంగా ప్రతిస్పందిస్తామని…