క్లుప్తంగా… 04.05.2012
జాతీయం మణిపూర్ విద్యార్ధి డ్రగ్స్ వల్ల చనిపోలేదు –ఫోరెన్సిక్ నివేదిక బెంగుళూరు లో చదువుతున్న మణిపూర్ విద్యార్ధి రిచర్డ్ లోయితం డ్రగ్స్ వల్ల చనిపోలేదని ఫోరెన్సిక్ ఫలితాలు నిర్ధారించినట్లు ‘ది హిందూ’ తెలిపింది. ఆర్కిటెక్చర్ విద్యార్ధి అతని సీనియర్ విద్యార్ధులు కొట్టడం వల్ల చనిపోయాడని అతని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. సీనియర్ విద్యార్ధుల దాడిలో చనిపోయినప్పటికీ బెంగుళూరు పోలీసులు కేసు నమోదు చేయలేదని మణిపూర్ విద్యార్ధులపైన వివక్ష పాటిస్తున్నారని ఆరోపిస్తూ దేశ వ్యాపితంగా మణిపూర్ విద్యార్ధులు నిరసన ప్రదర్శనలు…