ఆ శిక్ష చాలదు –ఇండియా, చాలు -అమెరికా

ముంబై టెర్రరిస్టు దాడులకు నెలల ముందుగానే తగిన ఏర్పాట్లు చేసిన ‘డేవిడ్ కోలమన్ హేడ్లీ’కి అమెరికా కోర్టు 35 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. ఈ శిక్ష తమను కొద్దిగా అసంతృప్తికి గురి చేసిందని భారత ప్రభుత్వం ప్రకటించగా, విచారణలో సహకరించాడు గనక ఆ శిక్ష చాలు అని అమెరికా చెబుతోంది. అమెరికా వరల్డ్ ట్రేడ్ సెంటర్ జంట టవర్ల పైన జరిగిన టెర్రరిస్టు దాడిని 9/11 పేరుతో పిలుస్తున్న నేపధ్యంలో ముంబై దాడులను 26/11 పేరుతో…

ముంబై దాడుల దోషి హేడ్లీ అప్పగింతకు ఇండియా సీరియస్‌గా లేదు -మాజీ భద్రతాధికారి

ముంబై దాడుల నిందితుడు హేడ్లీని అమెరికానుండి ‘నేరస్ధుల అప్పగింత ఒప్పందం’ కింద ఇండియాకి రప్పించడానికి, భారత ప్రభుత్వం అంత సీరియస్ గా లేదని అమెరికా రాయబారితో చెప్పిన విషయం వికీలీక్స్ వెల్లడించిన కేబుల్ ద్వారా బైటపడింది. లష్కర్ ఎ తొయిబా సభ్యుడు డేవిడ్ కోలమన్ హేడ్లీని ఇండియాకి రప్పించడానికి అమెరికాపై ఒత్తిడి చేసున్నట్లు పైకి కనిపించినప్పటికీ వాస్తవానికి ‘ఈ సమయంలో’ హేడ్లీని రప్పించడానికి భారత్ సిద్ధంగా లేదని భారత ప్రభుత్వ మాజీ భద్రతా సలహాదారు ఎం.కె.నారాయణన్ అమెరికా…