వికీలీక్స్ వెల్లడించిన కేబుల్స్ నిజమైనవే -రాయబారి మల్ఫోర్డ్

అమెరికా రాయబారులు రాసినవంటూ వికీలీక్స్ వెల్లడించిన కేబుల్స్ లోని సమాచారాన్ని నమ్మలేమని పార్లమెంటులో ప్రకటించిన భారత ప్రధాని కి సమాధానం దొరికింది. అసలు వికీలీక్స్ వెల్లడించిన కేబుల్స్ అసలు ఉన్నాయా లేదో కూడా రుజువులు లేవన్న మన్మోహన్ అనుమానానికి కూడా సమాధానం దొరికింది. సమాధానం ఇచ్చిన వారు ఎవరో కాదు. 2004 నుండి 2009 ఫిబ్రవరి వరకూ ఇండియాలో అమెరికా రాయబారిగా పనిచేసి ఇండియా పై తాను సేకరించిన సమాచారాన్ని కేబుల్స్ గా పంపిన డేవిడ్ సి.…

ఇండియా ప్రజల ప్రయోజనాలను దెబ్బతీసిన మన్మోహన్ అమెరికాల సంబంధం – 2

తర్వాత నవంబరులో జరిగిన ఐ.ఏ.ఇ.ఏ సమావేశంలో ఇరాన్ పై ఏ నిర్ణయం తీసుకోకుండా వాయిదా వేశారు. సీక్రెట్ వర్గీకరణతో డిసెంబరు 12 న పంపిన కేబుల్లో అమెరికా రాయబారి ఇరాన్-ఇండియా ల విషయం లేవనెత్తాడు. “మధ్యప్రాచ్యం కి సంబంధించి సమగ్రమైన విధానం రూపొందించుకోవడంలో ఇండియా సమర్ధతను చూపలేక పోయింది” అని రాశాడు. (ఇరాన్ నుండి ఇజ్రాయెల్ వరకు ఉన్న అరబ్, ముస్లిం దేశాలను కలిపి ‘మధ్యప్రాచ్యం’ గా సంభోధిస్తారు.) అంటే అమెరికా, ఇజ్రాయెల్ లకు అనుకూలంగా విదేశీ…