త్వరగా దయచేయండి! -ఈయు

‘బైటకు వెళ్లి పోవాలని నిర్ణయించుకున్నారు గదా, ఇంకా ఎన్నాళ్ళు చూరు పట్టుకుని వెళ్ళాడుతారు?’ అని బ్రిటన్ / యూకె ను నిలదీసి ప్రశ్నిస్తోంది యూరోపియన్ యూనియన్. కొందరు ఈయు నేతల ప్రకటనలు చూస్తే బ్రిటన్ నేతల నాన్చుడు ధోరణి వారికి ఎంత మాత్రం ఇష్టంగా లేదని స్పష్టం అవుతోంది. “యూరోపియన్ యూనియన్ నుండి బయటకు వెళ్ళే కార్యక్రమాన్ని బ్రిటన్ వీలైనంత త్వరగా పూర్తి చేయాలి” అని ఈయు కమిషనర్ ఒకరు హెచ్చరించారని రాయిటర్స్ వార్తా సంస్థ తెలిపింది.…

బ్రిటన్: కన్సర్వేటివ్ పార్టీ అనూహ్య విజయం

బ్రిటన్ ఎన్నికల్లో ఊహించని ఫలితాలు వచ్చాయి. అత్యంత నిఖార్సయిన, అభివృద్ధి చెందిన సర్వే ల నిర్వాహకులుగా చెప్పుకునే పశ్చిమ సర్వేలు సైతం ఊహించని ఫలితాలు వచ్చాయి. పాలక కన్సర్వేటివ్ పార్టీ, ప్రతిపక్ష లేబర్ పార్టీల మధ్య నువ్వా-నేనా అనట్లుగా పోటీ ఉంటుందని సర్వేలన్నీ ఊహించగా అందుకు విరుద్ధంగా ప్రధాని డేవిడ్ కామెరాన్ నేతృత్వంలోని పాలక పార్టీ అత్యధిక స్ధానాలు గెలుచుకోవడంతో పాటు సొంతగా ప్రభుత్వం ఏర్పాటు చేయగల మెజారిటీ సాధించింది. పాలక, ప్రతిపక్ష పార్టీలలో దేనికీ మెజారిటీ…

మండేలా అంతిమ క్రియల్లో ఒబామా ఫోటో సంబరం

ఒక వ్యక్తి చనిపోయినపుడు ఎవరైనా ఎలా ప్రవర్తిస్తారు? చనిపోయిన వ్యక్తి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలుపుతూ వారికి జరిగిన నష్టం వలన తాము ఎంత భాధగా ఉన్నది తెలిసేట్లుగా ప్రవర్తిస్తారు. వేరే ఎన్ని పనులున్నా వాటి జోలికి పోకుండా సంయమనం పాటిస్తారు. నెల్సన్ మండేలా లాంటి ప్రపంచ ప్రఖ్యాతి చెందిన పోరాట యోధుడు చనిపోయినప్పుడయితే ఎంత క్రమశిక్షణ పాటించాలో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కానీ అమెరికా, డెన్మార్క్, బ్రిటన్ దేశాల అధినేతలు ఇందుకు విరుద్ధంగా వ్యవహరించి వార్తలకెక్కారు.…