డీమానిటైజేషన్ వల్లే జి‌డి‌పి తగ్గింది -పాల్ కృగ్మన్

పాల్ రాబిన్ కృగ్మన్ అమెరికాకు చెందిన ప్రసిద్ధ పెట్టుబడిదారీ ఆర్ధికవేత్త. 2008లో ఆర్ధిక శాస్త్రంలో నోబెల్ బహుమతితో సత్కారం పొందిన ప్రముఖుడు. ‘న్యూ ట్రేడ్ ధియరీ’ మరియు ‘న్యూ ఎకనమిక్ జాగ్రఫీ’ సిద్ధాంతాలను ప్రతిపాదించినందుకు ఆయనకు ఆ సత్కారం ఆ దక్కింది. ప్రస్తుతం న్యూయార్క్ సిటీ యూనివర్సిటీలో ప్రొఫెసర్ గా పని చేస్తున్నాడు. న్యూయార్క్ టైమ్స్ పత్రికలో కాలమిస్టు కూడా. ఆయన మాటలకు పెట్టుబడిదారీ ప్రపంచం విలువ ఇస్తుంది. అలాంటి పాల్ కృగ్మన్ భారత జి‌డి‌పి వృద్ధి…

డీమానిటైజేషన్: పడిపోయిన ఇండియా జి‌డి‌పి

2016-17 సంవత్సరంలో ఇండియా జి‌డి‌పి గణనీయంగా పడిపోయింది. 8 శాతం పైగా నమోదు చేస్తుందని ఆర్ధిక సంవత్సరం ఆరంభంలో ప్రభుత్వం, ఆర్‌బి‌ఐ, ఆర్ధిక సలహాదారులు అంచనా వేయగా 7 శాతం మాత్రమే నమోదు అయినట్లు ప్రభుత్వం ప్రకటించిన గణాంకాలు తెలిపాయి. డీమానిటైజేషన్ వల్ల భారత ఆర్ధిక వృద్ధి రేటు పడిపోతుందన్న పలువురు నిపుణుల అంచనాలు నిజం కాగా ప్రభావం పెద్దగా ఉండబోదన్న కేంద్ర ప్రభుత్వ అంచనా తప్పింది. గడచిన ఆర్ధిక సంవత్సరం (2016-17) నాలుగవ త్రైమాసికంలో (జనవరి…

బి‌జే‌పి నేతల వైభోగాన్ని ఆపలేని వెడ్డింగ్ బిల్లు!

ఓ పక్క ప్రధాన మంత్రి వృధా ఖర్చు చేయొద్దని బోధిస్తారు. డీమానిటైజేషన్ ద్వారా నల్ల డబ్బు నిరోధించానని చెప్పుకుంటారు. అట్టహాసంగా జరిగే పెళ్లిళ్ల ఖర్చులపై పరిమితి విధించేందుకు కాంగ్రెస్ ఎం‌పి ప్రతిపాదించిన బిల్లును బి‌జే‌పి ప్రభుత్వ కేబినెట్ తానే స్వయంగా ఆమోదించి సభలో పెడుతుంది. మరో పక్క ఆ బి‌జే‌పి ఎం‌పిలే నల్ల డబ్బుని విచ్చలవిడిగా ఖర్చు చేస్తూ అంగరంగ వైభోగంగా పెళ్లిళ్లు కానిచ్చేస్తుంటారు. ‘కోటలు దాటే మాటలు, గడప దాటని చేతలు’ సామెతకు అచ్చమైన ప్రతినిధులు…

నాలుగో వంతు ఎటిఎంలు ఖాళీ

నిపుణులు హెచ్చరించినట్లగానే, డీమానిటైజేషన్ కష్టాలు ప్రజలని ఇంకా వదలలేదు. ఫిబ్రవరి మొదటి వారంలో (జనవరి వేతనాల కోసం) ఉద్యోగులు, మైక్రో-చిన్న-మధ్య తరహా పరిశ్రమల యజమానులు డబ్బు డ్రా చేశారు. దానితో బ్యాంకుల వద్ద కరెన్సీ నోట్లు నిండుకున్నాయి. ఎటిఎం లలో ఉంచేందుకు బ్యాంకుల వద్ద ఇక డబ్బు లేకపోవడంతో దేశంలో నాలుగో వంతు ఎటిఎం లు ఖాళీ అయిపోయాయి. ‘నో క్యాష్’ బోర్డులు అనేక ఎటిఎం ల ముందు వెక్కిరిస్తున్నాయి.  ఫిబ్రవరి 10 వరకు మాత్రమే ఈ…

పేదల కోసమే! -మోడీ కొత్త పాట

మొదట బ్లాక్ మనీ-ఉగ్రవాదం-దొంగ నోట్లపై పోరాటం అన్నారు; ఆ తర్వాత మారక వ్యవస్ధను డిజిటైజ్ చేయడమే లక్ష్యం అన్నారు’ ఇప్పుడు “పేద జనోద్ధరణ కోసమే” అంటున్నారు, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ.  మంగళవారం లోక్ సభలో తన డీమానిటైజేషన్ చర్యను సమర్ధించుకున్న ప్రధాన మంత్రి “ఇది పేదల తరపున చేస్తున్న పోరాటంలో భాగమే” అని సెలవిచ్చారు. “ఇండియాను శుభ్రం చేసేందుకు డీమానిటైజేషన్ కు నిర్ణయించాము. పేదల అభ్యున్నతికే నేను చేసే పోరాటం. పేదలకు రావలసింది దక్కడం కోసం…

నోట్ల రద్దు: ఇండియా వృద్ధి రేటు తగ్గించిన ఐ‌ఎం‌ఎఫ్

Originally posted on ద్రవ్య రాజకీయాలు:
ప్రపంచ కాబూలీవాలా కూడా ఒప్పేసుకున్నాడు. డీమానిటైజేషన్ వల్ల ఇండియా జి‌డి‌పి వృద్ధి రేటు అంచనాను ఐ‌ఎం‌ఎఫ్ కూడా తగ్గించేసుకుంది. 2016-17 ఆర్ధిక సంవత్సరంలో భారత్ జి‌డి‌పి 7.6 శాతం వృద్ధి చెందుతుందని గతంలో అంచనా వేసిన ఐ‌ఎం‌ఎఫ్ ఇప్పుడు దాన్ని 6.6 శాతానికి తగ్గించుకుంది. “ఇండియాలో ప్రస్తుత సంవత్సరానికి (2016-17) మరియు ఆ తర్వాత సంవత్సరానికి వృద్ధి రేటు అంచనాను వరుసగా 1 శాతం మరియు 0.4 శాతం మేరకు తగ్గిస్తున్నాము. దీనికి…

1% చేతిలో 58% దేశ సంపద -ఆక్స్ ఫామ్

ఆక్స్ ఫామ్ అన్నది బ్రిటన్ కు చెందిన స్వచ్చంద సంస్ధ. ఖచ్చితంగా చెప్పాలంటే 18 అంతర్జాతీయ ప్రభుత్వేతర సంస్ధల కాన్ఫెడరేషన్! అంతర్జాతీయంగా నెలకొన్న అసమానతలను అధ్యయనం చేసిన ఈ సంస్ధ భారత దేశంలో నెలకొన్న తీవ్ర అసమానతల గురించి కూడా తెలియజేస్తూ ఒక నివేదిక తయారు చేసి విడుదల చేసింది. (Scroll.in) ఆ నివేదిక ప్రకారం భారత దేశంలో:   సంపద యాజమాన్యం రీత్యా అత్యంత ఉన్నత స్ధానంలో ఉన్న 1 శాతం సంపన్నుల చేతుల్లో దేశానికి…

నోట్ల రద్దు: వివరాలు చెబితే ప్రాణాలకు ముప్పు -ఉర్జిత్

పెద్ద నోట్ల రద్దు చర్యకు ఎందుకు, ఎలా పూనుకున్నారో చెప్పండయ్యా అని అడుగుతుంటే కాని కారణాలు ఎన్నో చెబుతున్నారు. తరచుగా ఈ కారణాల మధ్య పొంతన ఉండడం లేదు. ఒకరు చెప్పిన కారణాలు మరొకరు చెప్పడం లేదు. మోడీ ఒకటి చెబితే జైట్లీ మరొకటి చెబుతారు. RBI గవర్నర్ గారు నోరు మెదపరు. ఇలా కాదని RTI చట్టాన్ని ఆశ్రయిస్తే ఆయన సరికొత్త కారణాలు చెబుతున్నారు.  నోట్ల రద్దు వల్ల తన ప్రాణానికి ముప్పు వచ్చిందనీ తనను…

నోట్ల రద్దు: టమాటో పంటను పశువులకు మేపుతున్న రైతులు

పెద్ద నోట్ల రద్దు వలన గట్టి దెబ్బ తిన్నవారిలో రైతులు ముఖ్యమైన వారు. ‘దేశానికి అన్నం పెట్టె రైతన్న’ అనీ, ‘దేశానికి వెన్నెముక’ అనీ ‘జై జవాన్, జై కిసాన్’ అనీ సవాలక్ష అలంకారాలతో రైతులను నెత్తిన పెట్టుకున్నట్లు కనిపించే ప్రభుత్వాలు ఆచరణలోకి వచ్చేసరికి రైతాంగాన్ని చావు దెబ్బ తీసే విధానాలను అమలు చేయటానికి ఎంత మాత్రం వెనకడుగు వేయరు. నోట్ల రద్దు నిర్ణయం వల్ల అటు ఖరీఫ్ రైతులు, ఇటు రబీ రైతులు ఇరువురూ తీవ్రంగా…

పెద్ద నోట్ల రద్దు వెనక అమెరికా?! -సాక్షి

  ఇది సాక్షి దిన పత్రికలో ఈ రోజు, జనవరి 9, 2017 తేదీన ప్రచురితం అయిన కధనం. నిన్న ఆంధ్ర జ్యోతి పత్రికలో వచ్చిన కధనం ఉటంకించిన సోర్స్ నే సాక్షి కధనం కూడా ఉటంకించింది. కాబట్టి రెండు కధనాలలో విషయం దాదాపు ఒకటే. ఇలాంటి కధనాలు తెలుగు పత్రికల్లో రావడం అరుదు కనుక సాక్షి కధనాన్ని కూడా బ్లాగ్ లో ప్రిజర్వ్ చేద్దామనే ఉద్దేశంతో దీనిని కూడా ప్రచురించడం జరుగుతోంది. ఇక్కడ క్లిక్ చేస్తే…

డీమానిటైజేషన్: అమెరికా చెప్పిందే మోడీ చేశారు!

[పై కత్తిరింపును పి‌డి‌ఎఫ్ లో చూసేందుకు ఇక్కడ క్లిక్ చేయండి] ఇలాంటి వాస్తవాలను సాధారణంగా భారతీయ పత్రికలు ప్రచురించవు. చాలా చాలా అరుదుగా మాత్రమే ఇలాంటి కధనాలు ఇండియాలో దర్శనం ఇస్తాయి. అంతర్జాతీయ పరిణామాలలో కూడా భారత పత్రికలు పశ్చిమ వార్తా సంస్ధల కథనాలను మాత్రమే అనుసరిస్తాయి తప్ప తాము సొంతగా పరిశోధన చేసి వాస్తవాలను వెలికి తీసే ప్రయత్నాలు చేయవు. తమకు తగిన సిబ్బంది లేనందున అలా చేయడం తప్పదని అవి తమను తాము సమర్ధించుకుంటాయి…

Q4 జి‌డి‌పి 4% కు పతనం -అధికారులు

Originally posted on ద్రవ్య రాజకీయాలు:
డీమానిటైజేషన్ / పెద్ద నోట్ల రద్దు ప్రభావం పెద్దగా ఉండదని కేంద్ర మంత్రులు ఇప్పటి వరకు చెప్పారు. జి‌డి‌పి మహా అయితే అర శాతం లేకుంటే అంతకంటే తక్కువ మాత్రమే తగ్గుతుందని ఆర్ధిక మంత్రి జైట్లీ నమ్మబలికారు. ప్రతిపక్షాలు, బి‌జే‌పి వ్యతిరేక ఆర్ధికవేత్తలు చెబుతున్నట్లు ఉత్పత్తి భారీగా పడిపోదని హామీ ఇచ్చారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంచనా వేసినట్లు 2% పతనం కావడం జరగనే జరగదన్నారు. కానీ కేంద్ర ప్రభుత్వ అధికారుల…

నోట్ల రద్దు నిరసన: లక్ష కి.గ్రాల కూరగాయలు ఫ్రీగా ఇచ్చేసిన రైతులు

“డీమానిటైజేషన్ వల్ల జనానికి కాస్త అసౌకర్యం కలిగించిన మాట నిజమే. కానీ ప్రజలందరూ డీమానిటైజేషన్ కు మద్దతు ఇస్తున్నారు. మోడీ మంచి చర్య తీసుకున్నారని ప్రశంసిస్తున్నారు. బ్లాక్ మనీకి వ్యతిరేకంగా ధైర్యంగా పోరాడుతున్నారని మెచ్చుఁకుంటున్నారు. దేశంలో ఏ ఒక్కరూ నిరసన తెలియజేయక పోవటమే అందుకు నిదర్శనం. జనం ఎక్కడా వీధుల్లోకి రాకపోవడమే అందుకు సాక్షం.”  ఇదీ ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రులు, బీజేపీ నేతలు పదే పదే చెబుతున్న మాట. డీమానిటైజేషన్ ఫలితంగా వందకు మందికి…

రాజు వెడలె రవి తేజము లలరగ… -కార్టూన్

డీమానిటైజేషన్ ప్రకటించినప్పుడు ‘ఆహా… ఒహో…’ అన్న వారంతా ఇప్పుడు వెనక్కి మళ్లుతున్నారు. U టర్న్ తీసుకుంటున్నారు. “బ్లాక్ మనీపై పోరాటం మంచిదే” అని నితీశ్ కుమార్ అప్పుడు తొందరపడి ఆమోదించేశారు. ఇప్పుడు “డిసెంబర్ 30 వరకూ చూసి, పరిస్ధితి సమీక్షించి నా అవగాహన చెబుతాను” అంటున్నారు. “నిర్ణయం, ఉద్దేశం మంచిదే, కానీ అమలు తీరు బాగోలేదు” అని సి‌పి‌ఐ నేతలు నీళ్ళు నమిలారు. ఇప్పుడు “పేదలకు, కార్మికుల జీవితాలు నాశనం చేశారు” అంటున్నారు. “ఇది చేయమని ఎప్పటి…

ఇంకో తుఘ్లక్ రూల్, డిసెంబర్ 30 లోపు ఒకే డిపాజిట్

భారత జనం పైన మరో తుఘ్లక్ నిబంధన వచ్చిపడింది. ఈసారి ఆర్‌బి‌ఐ చేత అధికారికంగా ఈ రూల్ ని జారీ చేయించారు. ఆర్‌బి‌ఐ నోటిఫికేషన్ ప్రకారం డిసెంబర్ 30 లోపు పాత నోట్లను బ్యాంకులో డిపాజిట్ చేసే అవకాశం ఒక్కసారే ఉంటుంది. డిపాజిట్ చేసే సొమ్ము రు 5,000 గానీ అంతకు లోపు గానీ ఉంటే బ్యాంకు వాళ్ళు నిన్ను ఏమీ అనరు. 5,000 కు పైన ఉంటే మాత్రం సవాలక్ష ప్రశ్నలతో వేధిస్తారు. అంతటితో అయిపోలేదు.…