మంచిరోజుల్లో మరో రోజు: కట్లు తెంచుకున్న డీజెల్

  ప్రధాని మోడి హామీ ఒసంగిన మంచి రోజుల్లో మరో శుభ దినం రానే వచ్చెను. డీజెల్ ధరల్ని మార్కెటింగ్ కంపెనీల దయాదాక్షిణ్యాలకు వదిలివేస్తూ డీ-రెగ్యులేషన్ కు మోడి ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే సందర్భం వచ్చినప్పుడల్లా కాంగ్రెస్ ను పడదిడుతూ కూడా, అదే కాంగ్రెస్ ఏలికలు నియమించిన రంగరాజన్ కమిటీ ఫార్ములాయే ఆదర్శంగా దేశీయ గ్యాస్ రేట్లను ఎం.ఎం.బి.టి.యు ఒక్కింటికి 4.2 డాలర్ల నుండి 5.61 డాలర్లకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. రంగరాజన్ కమిటీ సిఫారసు ప్రకారం…