ఎన్ కౌంటర్లు ఎందుకు చట్టవిరుద్ధం?

‘నిన్ను ఎన్ కౌంటర్ చేసేస్తా’ ఇది పోలీసు సినిమాల్లో తరచుగా వినపడే పదం. ఎన్ కౌంటర్ చేయడాన్ని వీరోచితకార్యంగా సినిమాలు వాడుకలోకి తెచ్చాయి. ‘ఎన్ కౌంటర్ స్పెషలిస్టు’ అనే బిరుదు కొందరు పోలీసులకు పత్రికలు తగిలించడం మొదలై చాలాకాలమే అయింది. వీటన్నింటి మూలంగా ఎన్ కౌంటర్ చెయ్యడం పోలీసుల విధి, కర్తవ్యం, బాధ్యత… ఇత్యాదిలాగా పరిస్ధితి తయారయింది. ఆంద్ర ప్రదేశ్ మాత్రమే కాదు, దాదాపు పోలీసులు, సైన్యంలకు ఆధిపత్యం అప్పగించి పాలన సాగించే ప్రతి చోటా ఈ…

మోడి & అమిత్ షా: ఇక పనిలోకి దిగుదాం! -కార్టూన్

కొత్త ప్రభుత్వం అధికారం లోకి వచ్చిన తోడనే గుజరాత్ లో సంచలన కేసుల కధలు ఒక్కొక్కటీ కంచికి ప్రయాణం కడుతున్నాయి. ఆయా కేసుల్లో నిందితులకు గౌరవ మర్యాదలతో పదవులు దక్కుతున్నాయి. షోరాబుద్దీన్ షేక్ (మరియు) ఆయన భార్య  ఎన్ కౌంటర్, ఇష్రత్ జహాన్ (మరియు మరో ముగ్గురు ముస్లిం యువకులు) ఎన్ కౌంటర్, తులసీరాం ప్రజాపతి హత్య తదితర కేసుల్లో నిందితులైన ఐ.పి.ఎస్ అధికారులు ఇద్దరిని సగౌరవంగా తిరిగి పదవులు కట్టబెట్టారు. ఆషామాషీ పదవులు కాకుండా శక్తివంతమైన…

నేను కాదు మోడి ప్రభుత్వం జైల్లో ఉండాలి -డి.ఐ.జి వంజార

గుజరాత్ ఎన్ కౌంటర్ స్పెషలిస్టుగా ప్రసిద్ధి చెందిన మాజీ డి.ఐ.జి వంజార తన ఐ.పి.ఎస్ పదవికి రాజీనామా చేశాడు. హోమ్ శాఖ కార్యదర్శికి రాసిన రాజీనామా లేఖలో ఆయన మోడి ప్రభుత్వాన్ని, ముఖ్యంగా మోడి నమ్మిన బంటు అమిత్ షాను ఉతికి ఆరేశాడు. వరుసగా అనేక బూటకపు ఎన్ కౌంటర్లకు పాల్పడినందుకు గాను మరో 36 మంది పోలీసు