పార్లమెంటుకి భారీ ముప్పు -కార్టూన్

రానున్న పార్లమెంటు సమావేశాలకు మరో భారీ ముప్పు పొంచి ఉంది. బడ్జెట్ సెషన్ రెండు విడత సమావేశాలను 2జి స్పెక్ట్రమ్ కుంభకోణం మరోసారి ముంచెత్తనుంది. కుంభకోణంపై చాసో నాయకత్వంలో ప్రభుత్వం నియమించిన జాయింట్ పార్లమెంటు కమిటీ (జె.పి.సి) తన నివేదిక ఈసారి సమావేశాల్లో ప్రవేశపెట్టనుండడమే ఆ ముప్పు. అదీ కాక మిత్రుల దూరంతో బడ్జెట్ ను ఆమోదింపజేసుకోవడం కాంగ్రెస్ కు కష్టం కావచ్చు. అందుకోసం కొన్ని లొంగుబాట్లు అవసరం పడవచ్చు. స్పెక్ట్రమ్ కుంభకోణంలో ప్రధాని తప్పేమీ లేదని,…

తమిళనాడు వేర్పాటుకు అమెరికా సాయం కోరిన డి.ఎం.కె నాయకన్? -వికీలీక్స్

తమిళనాడు రాష్ట్రం భారత దేశం నుండి విడిపోయి ప్రత్యేక దేశంగా ఏర్పడడానికి అప్పటి డి.ఎం.కె రాష్ట్ర మంత్రి ఒకరు అమెరికా సాయం కోరినట్లు అమెరికా రాయబార పత్రాల ద్వారా తెలుస్తోంది. మాజీ ప్రధాని ఇందిరాగాంధి ఎమెర్జెన్సీ పాలన విధించిన వారం రోజులకు తమిళనాడులో రాష్ట్ర ప్రభుత్వానికి నాయకత్వం వహించిన ద్రవిడ మున్నేట్ర కజగం పార్టీ నేత, రాష్ట్ర కార్మిక మరియు గృహ శాఖ మంత్రి కె.రాజారాం అమెరికా రాయబారిని కలిసి తమిళనాడు ప్రత్యేక దేశంగా విడిపోదలుచుకుంటే అమెరికా…

తమిళనాట ఇపుడు యు.పి.ఎ భాగస్వామి ఎవరు? -కార్టూన్

– డిఎంకె తెగతెంపులు చేసుకోవడంతో యుపిఎలో తమిళనాడు స్ధానం సీటు ఖాళీ అయింది. ముందస్తు ఎన్నికల ఊహాగానాలు జోరందుకున్న నేపధ్యంలో తమిళనాడులో ఖాళీ అయిన సీటును భర్తీ చేసుకోవడానికి కాంగ్రెస్ ఎదురు చూస్తోంది. తెలియని ప్రేమికుడి కోసం తమిళనాడు (T) గేటు వద్ద ఆ పార్టీ మోహ గీతాలు ఆలపిస్తోందని ది హిందూ కార్టూనిస్టు కేశవ్ కార్టూన్ సూచిస్తోంది. ఎన్నికల వేడి రాజుకునేకొద్దీ ఆ గీతాలకు స్పందించే వారు దొరక్కపోరు. వాడుకుని వదిలేయడం భారత పాలకులకు కొత్త…