జైట్లీపై విచారణ చట్ట విరుద్ధం -కేంద్రం

ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ పాల్పడ్డారని ఆరోపించబడుతున్న డి‌డి‌సి‌ఏ కుంభకోణంపై విచారణ చట్ట విరుద్ధం అని కేంద్ర ప్రభుత్వం తేల్చేసింది. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ ద్వారా ‘సలహా ఇవ్వండి’ అంటూ లేఖ రాయించుకుని ఆనక ‘ఆ విచారణ చట్టబద్ధం కాదు’ అని బి.జె.పి ప్రభుత్వం ప్రకటించేసింది. ‘అవినీతిపై రాష్ట్ర ప్రభుత్వ విచారణ చట్ట విరుద్ధం’ అని నిర్ధారించిన మొట్ట మొదటి కేంద్ర ప్రభుత్వంగా నరేంద్ర మోడి నేతృత్వంలోని ప్రభుత్వం ఘనతను మూటగట్టుకుంది. ‘అవినీతిని అంతం…

జైట్లీకి కీర్తి ఆజాద్ 52 ప్రశ్నలు

ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు జైట్లీ అవినీతిపై 5 ప్రశ్నలతో సరిపెడితే బి.జె.పి ఎం.పి కీర్తి ఆజాద్ ఏకంగా 52 ప్రశ్నలను సంధించారు. సోమవారం మాజీ టెస్ట్ క్రికెటర్ బిషన్ సింగ్ బేడి తో కలిసి విలేఖరుల సమావేశంలో మాట్లాడిన కీర్తి ఆజాద్, ఒక వ్యక్తిపై ఎక్కుపెట్టిన దాడి కాదని చెబుతూనే జైట్లీకి 52 ప్రశ్నాస్త్రాలను సంధించాడు. ప్రశ్నలను సంధించడంతోనే కీర్తి ఆజాద్ సరిపెట్టుకోలేదు. Wikileaks4India అనే వెబ్ సైట్, సన్ స్టార్ అనే పత్రికా విడుదల…

రాజీనామా చేయమని జైట్లీకి మోడి సంకేతం?!

ఢిల్లీ & డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ -డి‌డి‌సి‌ఏ- అధ్యక్షులుగా 13 సంవత్సరాలు, ప్యాట్రన్-ఇన్-చీఫ్ గా ఒక సంవత్సరం పదవులు నిర్వహించిన ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ, అవినీతి ఆరోపణల నేపధ్యంలో, రాజీనామా చేయవలసి ఉంటుందని ప్రధాని నరేంద్ర మోడి సంకేతం ఇచ్చారా? బి.జె.పి పార్లమెంటరీ పార్టీ బోర్డు సమావేశంలో నరేంద్ర మోడి చేశారంటూ కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు పత్రికలకు చెప్పిన వ్యాఖ్యలు ఈ అనుమానాన్ని కలిగిస్తున్నాయి. “ప్రధాన మంత్రి ఎల్.కె.అద్వానీ ఉదాహరణను ప్రస్తావించారు. అప్పటి ప్రభుత్వం…

డి‌డి‌సి‌ఏ-జైట్లీ అవినీతి ఇదే!

కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ డి‌డి‌సి‌ఏ అధ్యక్షులుగా ఉన్న కాలంలో జరిగిన అవినీతి వివరాలను ఏఏపి ప్రభుత్వం వెల్లడి చేసింది. ఏఏపి కి చెందిన వివిధ నేతలు, మంత్రులు ఈ రోజు (డిసెంబర్ 17, 2015) విలేఖరుల సమావేశం ఏర్పాటు చేసి జైట్లీ అవినీతి వివరాలను వెల్లడి చేశారు. ఢిల్లీ హైకోర్టు నియమించిన విచారణ కమిటీ, కేంద్ర ప్రభుత్వానికి చెందిన తీవ్ర అవినీతి నేరాల పరిశోధనా సంస్థ (సీరియ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ – ఎస్‌ఎఫ్‌ఐ‌ఓ)…