కీర్తి ఆజాద్ కు బిజెపి పెద్దల మద్దతు

కొందరు రాజకీయ విశ్లేషకులు అంచనా వేసినట్లుగా కీర్తి ఆజాద్ కు బిజెపి పెద్దల నుండి మద్దతు వస్తోంది. బి.జె.పి సైద్ధాంతిక మార్గదర్శక సంస్ధ ఆర్‌ఎస్‌ఎస్ సైతం కీర్తి ఆజాద్ విషయంలో పార్టీ వ్యవహరించిన తీరుపై అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. పార్టీ ఎం.పిని మొదట వివరణ కోరుతూ షో-కాజ్ నోటీసు ఇవ్వకుండా ఎకాఎకిన సస్పెండ్ చెయ్యడం పట్ల ఆర్‌ఎస్‌ఎస్ కూడా అసంతృప్తిగా ఉన్నట్లు వార్తలు చెబుతున్నాయి. చూడబోతే ఏ‌ఏ‌పి ఒత్తిడికి తలొగ్గి ఆదరాబాదరాగా కీర్తి ఆజాద్ ను సస్పెండ్…

డి‌డి‌సి‌ఏ స్కాం: అబ్బే పిచ్ లో స్వల్ప మార్పులు!

Keshav strikes again! డి‌డి‌సి‌ఏ స్కాంలో తన అవినీతిని అరుణ్ జైట్లీ ఎలా సమర్ధించుకుంటున్నారో ఈ కార్టూన్ విశ్లేషిస్తున్నది. ఫిరోజ్ షా కోట్ల స్టేడియంలో కొన్ని భాగాల్ని ఆధునికరించడానికి 24 కోట్ల అంచనాతో కాంట్రాక్టు అప్పగించగా పనులు ముగిసే నాటికి 114 కోట్లు చెల్లించడం ప్రధాన కుంభకోణం. ఆధునీకరణ పనుల్లో భాగంగా ఢిల్లీ మునిసిపాలిటీ అనుమతి లేకుండానే కొన్ని బాక్స్ లను నిర్మించారు. స్టేడియం స్ధలంలో అక్రమ నిర్మాణాలు చేసి వాటిని అక్రమంగా లీజులకి ఇచ్చేశారు. అదనంగా…