తమిళనాడు వేర్పాటుకు అమెరికా సాయం కోరిన డి.ఎం.కె నాయకన్? -వికీలీక్స్

తమిళనాడు రాష్ట్రం భారత దేశం నుండి విడిపోయి ప్రత్యేక దేశంగా ఏర్పడడానికి అప్పటి డి.ఎం.కె రాష్ట్ర మంత్రి ఒకరు అమెరికా సాయం కోరినట్లు అమెరికా రాయబార పత్రాల ద్వారా తెలుస్తోంది. మాజీ ప్రధాని ఇందిరాగాంధి ఎమెర్జెన్సీ పాలన విధించిన వారం రోజులకు తమిళనాడులో రాష్ట్ర ప్రభుత్వానికి నాయకత్వం వహించిన ద్రవిడ మున్నేట్ర కజగం పార్టీ నేత, రాష్ట్ర కార్మిక మరియు గృహ శాఖ మంత్రి కె.రాజారాం అమెరికా రాయబారిని కలిసి తమిళనాడు ప్రత్యేక దేశంగా విడిపోదలుచుకుంటే అమెరికా…

ఇండియా అణు పరీక్షను ముందే ఊహించిన అమెరికా -వికీలీక్స్

ఇందిరా గాంధీ హయాంలో భారత దేశం 1974 మే 18 తేదీన జరిపిన అణు పరీక్ష అప్పట్లో ఒక సంచలనం. రాజస్ధాన్ ఎడారిలో పోఖ్రాన్ వద్ద జరిపిన ఈ అణు పరీక్ష ఫలితంగా అమెరికా, యూరోపియన్ దేశాలు ఇండియాపై ఆంక్షలు విధించాయి. ఇండియా పట్ల అణు అంటరానితనాన్ని పాటించాయి. తాము ఒక పక్క అణ్వస్త్రాలను గుట్టలుగా పేర్చుకుంటూనే ఇండియాలాంటి మూడో ప్రపంచ దేశాలు అణ్వస్త్రాలు సమకూర్చుకోవడానికి వీలు లేదని శాసించాయి. అందుకోసం ఇంటర్నేషనల్ ఆటామిక్ ఎనర్జీ ఏజెన్సీ…

జార్జి ఫెర్నాండెజ్: పైకి అమెరికా వ్యతిరేకి, లోపల సి.ఐ.ఏ ఏజెంటు!

వికీలీక్స్ పత్రాలు మరోసారి సంచలనం సృష్టిస్తున్నాయి. డబ్బుతో సంబంధం లేకుండా వికీలీక్స్ తో ఒప్పందం చేసుకున్న ది హిందు పత్రిక తాజాగా మరిన్ని ‘డిప్లొమేటిక్’ కేబుల్స్’ లోని అంశాలను సోమవారం నుండి ప్రచురిస్తోంది. ‘డిప్లొమేటిక్ కేబుల్స్’ అంటే అమెరికా స్టేట్ డిపార్ట్ మెంట్ (విదేశాంగ శాఖ) కూ, వివిధ దేశాలలో అమెరికా నియమించుకున్న రాయబారులకు మధ్య జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాలు. హెన్రీ కిసింజర్ అమెరికా సెక్రటరీ ఆఫ్ స్టేట్ (విదేశాంగ మంత్రి) గా పని చేసిన కాలంలో…

‘వికీలీక్స్’లో తెలంగాణ, అమెరికా రాయబారితో స్పీకర్ భేటి

తెలంగాణ ఉద్యమంపై, అసెంబ్లీ మాజీ డిప్యుటి స్పీకర్, ప్రస్తుత స్పీకర్ నాదెండ్ల మనోహర్ అమెరికా రాయబారితో అభిప్రాయాలు పంచుకున్న సంగతి వికీలీక్స్ బైటపెట్టింది. భారత దేశంలోని అమెరికా రాయబారి అమెరికా ప్రభుత్వానికి రాసిన కేబుల్ ఉత్తరంలో తెలంగాణ ఉద్యమం గురించి విశ్లేషణ రాశాడు. ఈ విశ్లేషణ లోని అంశాలు ఇప్పటికే తెలంగాణ అంశంపై జరుగుతున్న చర్చలలో నానుతున్నవే అయినప్పటికీ, స్పీకర్ ద్వారా అమెరికా రాయబారికి చేరడమే, తెలంగాణ వాదుల్లో వ్యతిరేకతను రగిలిస్తోంది. నాదెండ్ల వెలిబుచ్చిన అభిప్రాయాల్లో కొన్ని…

ఆఫ్ఘనిస్ధాన్ నుండి వెళ్ళిపోవద్దు -అమెరికాని కోరిన భారత ప్రభుత్వం

ఆఫ్ఘనిస్ధాన్‌లో కొనసాగుతున్న నిత్య మారణహోమం భారత పాలకులకు దీపావళి లాగా కనిపిస్తున్నట్లుంది. కాకుంటే ఎక్కడినుండో ఏడేడు సముద్రాల ఆవలినుండి వచ్చిన అమెరికా, దాని తైనాతీ దేశాలు పొరుగు దేశాన్ని ఆక్రమించి బాంబుదాడులతో, సైనిక కాల్పుల్లో ఆఫ్ఘన్ ప్రజల ఉసురు తీస్తుంటే దాన్ని ఖండించి ఆఫ్ఘన్ ప్రజలకు సంఘీభావం ప్రకటించే బదులు దురాక్రమణ సైన్యాన్ని మరికొంత కాలం కొనసాగించాలని బ్రతిమాలుతుందా? బ్రిటిష్ వలసవాదులు, భారత ప్రజల పోరాటాలకు తలొగ్గి 1947లో దేశం విడిచి వెళ్ళిపోవడానికి నిశ్చయించినప్పుడు ఏ చైనా,…

అంతర్జాతీయ ఒత్తిడితో దారుణ నరకంనుండి బైటపడ్డ అమెరికా ఖైదీ “బ్రాడ్లీ మేనింగ్”

ప్రపంచ దేశాలపై తన ప్రయోజనాల కోసం బాసిజం చేసే అమెరికా, బహుశా మొట్టమొదటిసారిగా అంతర్జాతీయ ఒత్తిడికి, విమర్శలకు లొంగింది. దాదాపు తొమ్మిది నెలల నుండి సొంత దేశీయుడినే నరక బాధలు పెడుతున్న జైలు అధికారులు విచారణా ఖైదీ “బ్రాడ్లీ మేనింగ్”ని సాలిటరీ కనఫైన్‌మెంట్ సెల్ నుండి బైటకు అనుమతించింది. వికీలీక్స్ ఛీఫ్ ఎడిటర్ జులియన్ అస్సాంజ్ కి ఇరాక్, ఆఫ్ఘనిస్ధాన్ యుద్ధాలకు సంబంధించిన డాక్యుమెంట్లను, యాభై సంవత్సరాల డిప్లొమాటిక్ కేబుల్స్ ను లీక్ చేశాడన్న ఆరోపణలపై బ్రాడ్లీ…

సిరియా ఆందోళనలకు అమెరికా రహస్య సహాయం

సిరియా అధ్యక్షుడు రాజీనామా చేయాలంటూ జరుగుతున్న హింసాత్మక ఆందోళనలకు అమెరికా 5 సంవత్సరాలనుండీ రహస్యంగా నిధులు అందజేస్తూ వచ్చిన విషయాన్ని వికీలీక్స్ ద్వారా వెల్లడి అయ్యింది. 2006లో జార్జి బుష్ అధికారంలో ఉన్నప్పటినుండి ప్రారంభమైన ఈ సహాయం ఒబామా అధ్యక్షుడు అయ్యాక కూడా కొనసాగిన విషయం వికీలీక్స్ వెల్లడించిన డిప్లొమేటిక్ కేబుల్స్ ద్వారా స్పష్టమయ్యింది. సిరియా అధ్యక్షుడు అస్సద్ 2000 సంవత్సరంలో తన తండ్రి చనిపోయినప్పటినుండీ అధికారంలో ఉన్నాడు. ఇరాక్ మాజీ అద్యక్షుడు సద్దాం హుస్సేన్ లాగానే…

అమెరికాతో ‘ఎస్.ఒ.ఎఫ్.ఏ’ ఒప్పందం కుదుర్చుకోవాలని ఇండియాపై అమెరికా ఒత్తిడి

అమెరికాతో ఇండియా “సోఫా” ఒప్పందం (ఎస్.ఓ.ఎఫ్.ఏ) ఒప్పందం కుదుర్చుకోవాలని ఇండియాపై తీవ్ర ఒత్తిడి తెచ్చిన సంగతి వికీలీక్స్ వెల్లడించిన కేబుల్ ద్వారా బయటపడింది. అమెరికా రాయబార కార్యాలయానికి చెందిన ఉప ప్రధానాధికారి ఆగష్టు 16, 2005 తేదీన రాసిన కేబుల్ నెం. 38759 ద్వారా ఈ విషయం వెల్లడయ్యింది. మిలట్రీ డ్రిల్లు నిమిత్తం ఇండియా వచ్చే మిలట్రీ అధికారులకు, రాజకీయ, రాయబార అధికారులకు ఇచ్చిన విధాంగానే “డిప్లోమేటిక్ ఇమ్యూనిటీ” (రాయబార కార్యాలయ ఉద్యోగులకు వారు నియమించబడిన దేశాల…

ఇజ్రాయెల్ వ్యతిరేక తీర్మానానికి మద్దతిచ్చిన ఇండియాపై అమెరికా ఆగ్రహం -వికీలీక్స్

ఇండియాపై అమెరికా కర్రపెత్తనానికి ఇది మరో ఋజువు. ఈ సారి అమెరికా చెప్పినట్టు ఇండియా వినకపోవడమే వార్త. అయితే అందులో ఇండియా పాలక వర్గాల ప్రయోజనం ఇమిడి ఉండటంతో అమెరికా గీసిన గీత దాటడానికి ఇండియా పాలకులు ధైర్యం చేశారు. డిసెంబరు 2008లో ఇజ్రాయెల్ పాలస్తీనా ప్రాంతం గాజా పై దాడి చేసి అక్కడి పౌరులను చంపడాన్ని ఖండిస్తూ చేసిన తీర్మానానికి ఇండియా మద్దతు తెలిపింది. ఓటింగ్ కుముందు అమెరికా లాబీయింగ్ ను ఇండియా వ్యతిరేకించిన విషయాన్ని…

‘ఉగ్రవాద వ్యతిరేక యుద్ధం’పై అమెరికాకు ప్రోగ్రెస్ రిపోర్టు సమర్పించుకున్న భారత ప్రభుత్వం -వికీలీక్స్ – 2

2005, 2007 ల మధ్య కాలంలో అమెరికా, ఇండీయా లమధ్య అణు ఒప్పందం కుదరడం వెనక అన్ని పనులు పూర్తి కావడంలో తీవ్రంగా శ్రమించిన జై శంకర్ ఇప్పుడు ఇండియా తరపున చైనాకు రాయబారిగా పని చేస్తున్నాడు. రాబర్ట్ బ్లేక్ ఆ తర్వాత శ్రీలంక, మాల్దీవులకు అమెరికా రాయబారిగా పని చేశాడు. ఈయన ఇప్పుడు అమెరికా ప్రభుత్వంలోని స్టేట్ డిపార్ట్ మెంటు లో దక్షిణ, మధ్య ఆసియా దేశాల వ్యవహారాల శాఖకు అసిస్టెంట్ సెక్రటరీగా పని చేస్తున్నాడు.…

‘ఉగ్రవాద వ్యతిరేక యుద్ధం’పై అమెరికాకు ప్రోగ్రెస్ రిపోర్టు సమర్పించుకున్న భారత ప్రభుత్వం -వికీలీక్స్ – 1

శ్రీశ్రీ గారి మహా ప్రస్ధానం రచనకు గుడిపాటి చలం ముందుమాట రాశారు. అందులో ఆయన “కృష్ణశాస్త్రి బాధ ప్రపంచానికి బాధ, ప్రపంచం బాధ శ్రీశ్రీ కి బాధ” అని చమత్కరించారు. అది చమత్కారమే అయినా వాస్తవం కూడా ఉంది, అది వేరే సంగతి. అమెరికా విషయంలో కూడా ఇది వర్తిస్తుంది. అమెరికాకి ఏ భాధ వచ్చినా దాన్ని ప్రపంచానికి అంటగడుతుంది. ఎయిడ్స్ జబ్బుని అలాగే అంటగట్టింది. “టెర్రరిజం పై సమరా”న్ని కూడా అలాగే అంటగట్టింది. తాజాగా ఆర్ధిక…

యు.పి.ఏ ప్రభుత్వంలో దళితుల గురించి పట్టించుకునే నాధుడే లేడు -అమెరికా రాయబారి (వికీలీక్స్)

  భారత దేశంలో అధికారంలో ఉన్న యు.పి.ఏ ప్రభుత్వం నిమ్న వర్గాలకు చాలా చేస్తున్నట్లు గప్పాలు కొట్టుకొంటుంది. ‘పనికి ఆహార పధకం’, ‘ఉపాధి హామీ పధకం’, తాజాగా ‘ఆహార భద్రతా చట్టం’ ఇలా దేశంలోని పేదవారి కోసం పలు పధకాలు రూపొందించి వారిని పైపైకి లాగడానికి తీవ్రంగ శ్రమిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం సమయం వచ్చినప్పుడల్లా డబ్బా కొట్టుకుంటుంది. ఒక్క యు.పి.ఏ అనే కాదు. దానికి ముందు పాలించిన ఎన్.డి.ఏ, దానికి ముందు యునటెడ్ ఫ్రంట్, కాంగ్రెస్ తదితర…

దావూద్ ఇబ్రహీం కూతురి పెళ్ళి, ఆగ్రహించిన అమెరికా రాయబారి -వికీలీక్స్

దావూద్ ఇబ్రహీం కూతురి పెళ్ళి ప్రముఖ పాకిస్తాన్ క్రికెటర్ జావేద్ మియాందాద్ కొడుకు తొ జరిగిన విషయం తెలిసిందే. జులై 2005 లో జరిగిన ఈ వివాహం రిసెప్షన్ జులై 23, 2005 తేదీన దుబాయ్ లోని హోటల్ హయత్ లో జరిగింది. ఈ హోటల్ యజమాని అమెరికాకి చెందిన హయత్ కార్పొరేషన్ కావడమే అమెరికా రాయబారి ఆగ్రహానికి కారణం. దుబాయ్ లోని హోటల్ హయత్ అమెరికాకి చెందిన హోటల్ అని భారత దేశంలో అందరికీ తెలుసనీ,…

ఇండియా, అమెరికాల అణు ఒప్పందంపై బిజేపి వ్యతిరేకత ఉత్తుత్తిదే -అద్వానీ (వికీలీక్స్)

యు.పి.ఏ ప్రభుత్వం హయాంలో అమెరికా ఇండియా లమధ్య కుదిరిన అణు ఒప్పందం పై బిజేపి తెలిపిన వ్యతిరేకత నిజానికి ఉత్తుత్తిదే అని ఆ పార్టీ ముఖ్య నాయకుడు ఎల్.కె.అద్వానీ అమెరికా రాయబారికి చెప్పిన విషయం వికీలీక్స్ లీక్ చేసిన డిప్లొమాటికి కేబుల్స్ ద్వారా స్పష్టమయ్యింది. 2009 పార్లమెంటు ఎన్నికలు ముగిశాక ఫలితాలు ప్రకటించడానికి కొద్ది రోజుల ముందు అమెరికా రాయబారి కార్యాలయం చార్జి డి’ ఎఫైర్స్ పీటర్ బర్లే (రాయబార కార్యాలయంలో ముగ్గురు ముఖ్య రాయబారులు ఉంటారు…

వికీలీక్స్ ను నమ్మలేం -ప్రధాని మన్మోహన్

యు.పి.ఏ – 1 ప్రభుత్వం 2008 సంవత్సరంలో విశ్వాస పరీక్ష నెగ్గడానికి లంచాలు ఇచ్చిందన్న ఆరోపణను భారత ప్రధాని మన్మోహన్ తిరస్కరించాడు. మా ప్రభుత్వం లో ఎవరూ ఆ సమయంలో అనైతిక కార్యకలాపాలకు పాల్పడలేదని ఆయన పార్లమెంటుకు చెప్పాడు. ప్రతిపక్షాలు “ఊహాత్మక, నిర్ధారించని, నిర్ధారించలేని” ఆధరాలతో ఆరోపణలు చేస్తున్నాయని సభకు తెలిపాడు. గురువారం సభలో జరిగిన చర్చకు సమాధానం ఇస్తూ మన్మోహన్ “వికీలీక్స్” సంస్ధ నమ్మదగినది కాద”ని అన్నాడు. “అసలు వికీలీక్స్ ఉనికినే ప్రభుత్వం గుర్తించడం లేదని…