ఇన్ ఫ్లేషన్, డిఫ్లేషన్, రిఫ్లేషన్… -ఈనాడు

ఒక దేశ ఆర్ధిక వ్యవస్ధ యొక్క ఆర్ధిక మౌలికాంశాల్లో (ఎకనమిక్ ఫండమెంటల్స్) ద్రవ్యోల్బణం ఒకటి. ద్రవ్యోల్బణం గురించి ఆర్ధికవేత్తలు అనేక సిద్ధాంతాలు చెబుతారు. ఆ సిద్ధాంతాలన్నీ మనిషి సృష్టించిన కృత్రిమ మారక సాధనం అయిన డబ్బు చుట్టూనే తిరుగుతాయి. ఎన్ని సిద్ధాంతాలు వల్లించినా డబ్బును నియంత్రించే ధనికవర్గాల జోలికి ఆర్ధికవేత్తలు వెళ్లరు. ఫలితంగా ఆ సిద్ధాంతాలన్నీ వాస్తవ పరిస్ధితులకు దరిదాపుల్లోకి వెళ్లడంలో విఫలం అవుతాయి. దాంతో మళ్ళీ మళ్ళీ సరికొత్త సిద్ధాంతాలతో ఆర్ధికవేత్తలు ముందుకు రావడానికి పరిస్ధితులు…