‘డబుల్ డిప్ రిసెషన్’ లో ఇంగ్లండ్

ఇంగ్లండ్ ‘డబుల్ డీప్ రిసెషన్’ లోకి జారుకుంది. 2012 లో మొదటి క్వార్టర్ (జనవరి, ఫిబ్రవరి, మార్చి) లో బ్రిటన్ జి.డి.పి (గ్రాస్ డోమెస్టిక్ ప్రోడక్ట్) 0.2 శాతం మేరకు కుదించుకుపోయింది. అంటే జి.డి.పి వృద్ధి చెందడానికి బదులు తగ్గిపోయింది. 2011 చివరి క్వార్టర్ లో (అక్టోబరు, నవంబరు, డిసెంబరు) ఇంగ్లండ్ జి.డి.పి 0.3 శాతం క్షీణించింది. వరుసగా రెండు క్వార్టర్ల పాటు నెగిటివ్ జి.డి.పి వృద్ధి నమోదయితే ఆ దేశం మాంద్యం (రిసెషన్) లో ఉన్నట్లు…

ఈ వారంలో భారిగా నష్టపోయిన షేర్ మార్కెట్లు

ఈ శుక్రవారంతో ముగిసిన వారంలో భారత షేర్ మార్కెట్లు భారీగా నష్టపోయాయి. అమెరికా, యూరప్ ల రుణ సంక్షోభాలు నష్టాలకు ప్రధాన కారణంగా నిలిచాయి. అమెరికా, యూరప్ ల ఆర్ధిక వృద్ధిపై అనుమానాలు తీవ్రం అయ్యాయి. సోమవారం స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆ రోజు మార్కెట్లకు సెలవు. మంగళవారం ప్రారంభమయిన షేర్ మార్కెట్లలో బి.ఎస్.ఇ సెన్సెక్స్ 17055.99 పాయింట్ల వద్ద ట్రేడింగ్ ప్రారంభించింది. ఈ రోజు శుక్రవారంతో ట్రేడింగ్ ముగిసే సమయానికి 16141.67 పాయింట్ల వద్ద క్లోజయ్యింది.…

రుణ సంక్షోభంలో ఫ్రాన్సు కూడా! పతనబాటలో అమెరికా, యూరప్ షేర్లు

అమెరికా క్రెడిట్ రేటింగ్ ప్రభావం నుండి తేరుకుని మంగళవారం అమెరికా, యూరప్ దేశాల స్టాక్ మార్కెట్లు లాభాలు చవి చూశాయి. కాని ఆ ఆనందం బుధవారానికి అవిరైపోయింది. యూరోజోన్‌లో రెండవ శక్తివంతమైన ఆర్ధిక వ్యవస్ధ కలిగి ఉన్న ఫ్రాన్సు కూడా యూరప్ అప్పు సంక్షొభం బారిన పడనుందని అనుమానాలు బలంగా వ్యాపించాయి. దానితో యూరప్, అమెరికా ల షేర్ మార్కెట్లు పెద్ద ఎత్తున అమ్మకాలకు గురైనాయి. రుణ సంక్షోభం దరిమిలా ఫ్రాన్సు క్రెడిట్ రేటింగ్ కూడా తగ్గిపోతుందన్న…

ఒక్క వారంలో $2.5 ట్రిలియన్లు నష్టపోయిన ప్రపంచ షేర్ మార్కెట్లు

ఈ ఒక్క వారంలోనే ప్రపంచ షేర్ మార్కెట్లు మొత్తం 2.5 ట్రిలియన్లు నష్టపోయాయని రాయిటర్స్ తెలిపింది. ఇది రు.1.125 కోట్ల కోట్లకు లేదా రు.1,12,50,000 కోట్లకు సమానం. ఫ్రాన్సు వార్ధిక స్ధూల జాతీయోత్పత్తి కూడా సరిగ్గా ఇంతే ఉంటుంది. ఒక ప్రధాన అభివృద్ధి చెందిన దేశ జిడిపితో సమానంగా ప్రపంచ షేర్ మార్కెట్లు ఈ ఒక్క వారంలోనే (ఆగస్టు 1 నుండి 5 వరకు) నష్టపోయాయన్నమాట! ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధ “డబుల్ డిప్” వైపుకి మరొక “ది…