మృత జవాన్లకు సానుభూతికూడా ట్విట్టర్ తోనేనా?

“మహారాష్ట్ర, పులగావ్ వద్ద సెంట్రల్ ఆమ్యూనిషన్ డిపోలో మంటలకు ప్రాణాలు నష్టపోవడం బాధ కలిగిస్తోంది. నా ఆలోచనలు బాధితులతో ఉన్నాయి.” అని ఒక ట్వీట్ లో ప్రధాని నరేంద్ర మోడి పేర్కొన్నారు. “గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్ధిస్తున్నాను. ఆర్‌ఎం మనోహర పరికర్ ఘటనా స్ధలిని సందర్శించి పరిస్ధితిని సమీక్షించాలని కోరాను” అని మరో ట్వీట్ లో ప్రధాని పేర్కొన్నారు. ట్విట్టర్ ద్వారా కాకుండా ప్రధాన మంత్రి కార్యాలయం నుండి ప్రకటన వెలువడినట్లుగానీ, అందినట్లుగానీ ఏ పత్రికా…