ఇండియా, చైనా: తమలపాకుతో నువ్వొకటి, తలుపు చెక్కతో నేనొకటి

దౌత్య రంగంలో ఇండియా, చైనాలు తలపడిన ఘటన ఒకటి చోటు చేసుకుంది. ‘తమలపాకుతో నేనొకటి’ అన్నట్లుగా ఇండియా ఒకటి చేస్తే, ‘తలుపు చెక్కతో నేనూ ఒకటి’ అని చైనా మరొకటి చేసింది. ప్రపంచంలోనే అతి పెద్ద కమోడిటీ వ్యాపార కేంద్రం అయిన ‘యివు’ కి ప్రయాణించే ముందు జాగ్రత్తగా ఉండాలని ఇండియా తన వ్యాపారులకు ‘ట్రావెల్ అడ్వైజరీ’ జారీ చేయగా, ఇండియా వ్యాపితంగా నిరసనలు జరుగుతున్నందున అక్కడికి ప్రయాణం పెట్టుకునే ముందు పదిసార్లు ఆలోచించాలని చైనా ఏకంగా…

పండగ కాలం ఇది, ఇండియా వెళ్లకండి -ఐదు దేశాల సలహా

పండగల కాలం అయినందున ఇండియా ప్రయాణం క్షేమకరం కాదనీ, అందువలన ఇండియా వెళ్లవద్దనీ తమ తమ దేశస్ధులకు ఐదు దేశాలు సలహా ఇచ్చాయి. అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల ప్రభుత్వాలు ఈ మేరకు ట్రావెల్ అడ్వైజరీలను జారీ చేశాయి. పండగల కాలంలో ఇండియాలో టెర్రరిస్టు దాడులు జరిగే అవకాశం ఉందని ఈ దేశాలు భావిస్తున్నాయి. ఈ సలహా పట్ల భారత ప్రభుత్వం అసంతృప్తిని వెళ్ళగక్కింది. ఈ సలహాతో తమ టూరిజం వ్యాపారం దెబ్బతింటుందని భారత అధికారులు…