రెండో రోజూ కొనసాగిన ట్యునీషియా ప్రదర్శనలు

శుక్రవారం “ఆగ్రహ దినం” గా పాటిస్తూ రాజధాని ట్యునిస్ లో లక్ష మందితో సాగిన ప్రజా ప్రదర్శనలు శనివారం కూడా కొన సాగాయి. శనివారం పోలీసులు జరిపిన కాల్పుల్లో ముగ్గురు పౌరులు జరిపారు. ప్రదర్శకుల రాళ్ళ దాడిలో పోలీసులు కూడ గాయ పడ్డారు. తాత్కాలిక ప్రభుత్వానికి ప్రధాన మంత్రి గా ఉన్న ఘన్నౌచీ రాజీనామా కోరుతూ ట్యునీషియా ప్రజలు ఆందోళనలు జరుపుతున్నారు. కొంతమంది రాజధాని ట్యునిస్ లో గుడారాలు వేసుకుని నిరసన కొనసాగిస్తున్నారు. ప్రధాన మంత్రి, పదవీచ్యుతుడైన…

మధ్యంతర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ట్యునీషియా ప్రజల భారీ ప్రదర్శన

  ప్రజల తిరుగుబాటుతో దేశం వదిలి పారిపోయిన ట్యునీషియా మాజీ అధ్యక్షుడు బెన్ ఆలీ మద్దతుదారులే తాత్కాలిక ప్రభుత్వం నడుపుతుండడంతో మొదటినుండి నుండి అసంతృప్తితో ఉన్న ట్యునీషియా ప్రజలు తాత్కాలిక ప్రధాన మంత్రి మహమ్మద్ ఘన్నౌచీ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం రాజధాని ట్యునీస్ లో భారీ ప్రదర్శన నిర్వహించారు. బెన్ ఆలీ ప్రభుత్వంలో ఉన్నవారెవరూ ప్రభుత్వంలో ఉండకూడదని ప్రజలు మాజీ అధ్యక్షుడు సౌదీ అరేబియా పారిపోయిన దగ్గర్నుండీ డిమాండ్ చేస్తున్నారు. తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడినప్పటికీ…

ట్యునీషియా ఆపద్ధర్మ అధ్యక్షునికి మరిన్ని అధికారాలు

ప్రజల తిరుగుబాటుతో దేశం విడిచి పారిపోయిన పాత అధ్యక్షుడి స్ధానంలో తాత్కాలిక (ఆపద్ధర్మ) అధ్యక్షునిగా అధికారాన్ని చేపట్టిన ఫోద్ మెబజాకి ఇప్పుడు పార్లమెంటుతో సంబంధం లేకుండా డిక్రీతో పాలించే అధికారాలను సంక్రమింపజేశారు. మెబాజా పదవీచ్యుతుడైన పాత అధ్యక్షుడు బెన్ ఆలీకి సన్నిహితుడుగా పేరు పొందిన వ్యక్తి. బెన్ ఆలీ పాలనలో దాదాపు పదకొండు సంవత్సరాలపాటు  ప్రధానిగా పని చేశాడు. పార్లమెంటుతో సంబంధం లేకుండా డిక్రీ ద్వారా పాలించ వచ్చు. సెనేట్ ఓటింగ్ ద్వారా అటువంటి అధికారాలను దఖలు…

నిజమే నేను తప్పు చేశాను -ఫ్రాన్స్ విదేశీ మంత్రి మేరీ

“ట్యునీషియా వ్యాపారవేత్త సొంత విమానంలో ప్రయాణం చేయటం నా తప్పే” అంటూ ఫ్రాన్స్ విదేశాంగ మంత్రి ఇప్పుడు లెంపలు వేసుకుంటోంది. ఓ పక్కన టునీషియా ప్రజలను రెండున్నర దళాబ్దాల పాటు నియంతలా పాలించిన అధ్యక్షుడు బెన్ ఆలీకి వ్యతిరేకంగా అక్కడి ప్రజలు పెద్ద ఎత్తున ప్రదర్శనలు నిర్వహిస్తూ పోలీసుల చేతిలో అనేక మంది చనిపోతుండగా అతని సన్నిహితుడయిన వ్యాపారవేత్తకి చెందిన ప్రైవేటు విమానంలో విహారయాత్రకు ట్యునీషియా బయలుదేరి రావటంతో ఫ్రాన్స్ విదేశాంగ మంత్రి ఎలియట్ మేరీ ప్రపంచ…

ట్యునీషియా పోలీసుల కాల్పుల్లో ఇద్ధరు పౌరుల మృతి

ట్యునీషియాలో పోలీసు కాల్పుల్లో మరో ఇద్దరు పౌరులు చనిపోయారు. వాయవ్య ప్రాంతంలో ఉన్న కెఫ్ పట్టణంలో ఈ సంఘటన జరిగింది. పోలీసుల పెత్తనానికి వ్యతిరేకంగా స్ధానికులు పోలీసు స్టేషన్ ముందు గుమిగూడి నిరసన వ్యక్తం చేస్తుండగా పోలీసులు కాల్పులు జరిపినట్లు సమాచారం. అక్కడి పోలీస్ చీఫ్ నిరసనకారులలోని ఒక మహిళను చెంపపై కొట్టాటంతో పరిస్ధితి విషమించినట్లు బి.బి.సి తెలిపింది. మహిళపై చేయి చేసుకున్నాక ప్రజలు కోపంతో స్టేషన్ పై రాళ్ళు, పెట్రోల్ బాంబులు విసరటంతో పోలీసులు కాల్పులు…