అమెరికా ఓడ సిబ్బంది అరెస్టు

అమెరికన్లు ఒక్కరు కూడా లేని ‘సీమన్ గార్డ్ ఒహియో’ ఓడ సిబ్బందిని భారత పోలీసులు మొత్తానికి అరెస్టు చేశారు. అమెరికా ప్రైవేటు సెక్యూరిటీ కంపెనీ అడ్వాన్ ఫోర్ట్ కి చెందిన ఈ ఓడ సిబ్బందిలో భారతీయులు కూడా ఉన్నారు. కానీ అమెరికన్ ఒక్కరూ లేరు. బ్రిటన్, ఎస్తోనియా, ఉక్రెయిన్ తదితర దేశాలకు చెందిన సిబ్బందిని అక్రమ ఆయుధాలు కలిగి ఉన్నందుకు, చట్ట విరుద్ధంగా డీజెల్ కొనుగోలు చేసినందుకు, భారత సముద్ర జలాల్లో అనుమతి లేకుండా ప్రవేశించినందుకు అరెస్టు…

కూడంకుళం: ఆగని నిరసనలు, ట్యుటికోరిన్ పోర్టు సీజ్

కూడంకుళం అణు కర్మాగారానికి వ్యతిరేకంగా లక్షలాది గ్రామ ప్రజలు సాగిస్తున్న పోరాటం కొనసాగుతోంది. ప్రజల భయాలు, ఆందోళనలు పట్టించుకోకుండా కూడంకుళం అణు రియాక్టర్ లో యురేనియం ఇంధన కడ్డీలను నింపడం ప్రారంభం అయిన నేపధ్యంలో మత్స్యకారులు వెయ్యికి పైగా పడవలతో ట్యుటికోరిన్ పోర్టును శనివారం దిగ్బంధించారు. తమిళనాడు తీరం అంతటా మత్స్యకారులు ఆందోళన చేయాలని PMANE (Peoples Movement Aganist Nuclear Energy) ఇచ్చిన పిలుపు మేరకు ప్రజలు ఈ నిరసనను చేపట్టారు. మరో వైపు అణు…