ఎం.ఎన్.ఎస్: పోలిటికల్ టోల్ గేట్ -కార్టూన్

టోల్ గేట్ అంటేనే బాదుడుకి ప్రతిరూపం. ప్రజల కోసం అని చెప్పి రోడ్లు వేసి, ఆ రోడ్లను ప్రైవేటు కంపెనీలకు అప్పజెప్పి జనాన్ని బాదే అధికారాన్ని సైతం వారికి ఇవ్వడం పచ్చి ప్రజా వ్యతిరేక చర్య. వాహనాలు కొన్నపుడు రోడ్ టాక్స్ వేస్తారు. బస్సుల్లో తిరిగితే టిక్కెట్ డబ్బులు వసూలు చేస్తారు. పెట్రోల్ కొన్నప్పుడు కూడా దానిపైన సవాలక్షా పన్నులు వేసి సామాన్యులకు అందకుండా చేస్తారు. ఇవన్నీ పోను మళ్ళీ టోల్ గేట్ రుసుము వసూలు చేయడం,…

మెరుగైన సేవలు కావాలంటే ప్రైవేటు కంపెనీలకి పట్టణ ప్రజలు మరింత చెల్లించుకోవాల్సిందే -కేంద్ర మంత్రి

భారత దేశ ప్రజలకు ఇప్పటివరకూ అన్నీ ఉచితంగా వాడుకోవడం అలవాటయ్యిందనీ, కానీ రోడ్లు, నీరు, విద్యుత్ లాంటి సేవలు మెరుగుపడాలంటే మరింతగా చెల్లించడానికి సిద్ధమైతే తప్ప సాధ్యం కాదనీ కేంద్ర పట్టణాభివృద్ధి శాఖా మంత్రి కమల్ నాధ్ తెగేసి చెబుతున్నాడు. రాయిటర్స్ వార్తా సంస్ధకి నాలుగు రోజుల క్రితం ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పట్టణాల్లొ సేవలను మెరుగుపరచడం కోసం ఇప్పటివరకూ ప్రభుత్వం ఒక్కటే బాధ్యత తీసుకున్నదనీ, ఇకనుండి ప్రైవేటు కంపెనీలకు పట్టణాల్లో మౌలిక సౌకర్యాల నిర్మాణానికి భాగస్వామ్యం…