అభివృద్ధి చెందిన దేశాలన్నింటిలో ‘ఆకుపై వాల్‌స్ట్రీట్’ తరహా ఆందోళనలు

“ఆకుపై వాల్‌స్ట్రిట్!” నెల రోజుల క్రితం కేవలం కొద్ది డజన్ల మందితో ప్రారంభమైన ఈ అందోళన ఇపుడు ప్రపంచ స్ధాయి ఆందోళనగా మారింది. రెండు వారాలకే అమెరికా అంతటా పాకిన అమెరికన్ల ఆందోళనలు ఆ తర్వాత యూరప్ దేశాలకు కూడా పాకాయి. ఇపుడు జపాన్ నగరం టోక్యోకు పాకి “టోక్యో ఆక్రమిద్దాం” అంటూ జపనీయులు నినదిస్తున్నారు. ప్రపంచ ఆర్ధిక సంక్షోభం పేరు చెప్పి ట్రిలియన్ల కొద్దీ ప్రజా ధనాన్ని ‘బెయిలౌట్’లుగా వాల్‌స్ట్రీట్ కంపెనీలకు పందేరం పెట్టిన సంగతి…