టెర్రరిజంను అమెరికా ఎలా ప్రోత్సహిస్తుంది?

జి.కె.గణేష్: టెర్రరిజంని అమెరికాయే మొదట్లో ప్రోత్సహిస్తుందని మీ వ్యాసాల్లో చదివాను. అదెలాగో వివరించగలరా? సమాధానం: ప్రపంచంలో వివిధ చోట్ల పెచ్చరిల్లుతున్న ఉగ్రవాద దాడుల గురించి గతంలో రాశాను. ఆ సంఘటనల గురించి రాసినప్పుడు వాటి వెనుక అమెరికా హస్తం ఉందని చెప్పినా, ఉండవచ్చని చెప్పినా దానికి సంబంధించిన వివరాలు కూడా ఆ సందర్భంలోనే వివరించాను. బహుశా అప్పటి వివరణలు మీ దృష్టికి వచ్చినట్లు లేదు.  ఏయే ఉగ్రవాద ఘటనలు జరిగాయో వివరిస్తూ వాటి వెనుక అమెరికా హస్తం…

బోస్టన్ బాంబు పేలుళ్లు -ఫోటోలు

అమెరికాలోని బోస్టన్ నగరంలో బాంబు పేలుళ్లు జరిగాయి. సెకన్ల వ్యవధిలో జరిగిన రెండు బాంబు పేలుళ్లలో ముగ్గురు చనిపోగా 130 మందికి పైగా గాయపడ్డారు. గాయపడినవారిలో ఆరుగురి పరిస్ధితి విషమంగా ఉంది. 40 కి.మీ బోస్టన్ మారధాన్ పరుగు పందెం చివరి అంచెలో ఈ పేలుడు సంభవించింది. ప్రేక్షకులు నిలుచున్న చోట పేలుడు జరిగినట్లు కనిపిస్తోంది. పేలుడు అనంతరం ఏరియల్ వ్యూ నుండి తీసిన వీడియోను కింద చూడవచ్చు.   ఈ కింది ఫోటోలను ఆర్.టి (రష్యా…

అమెరికాలో బాంబు పేలుడు, ముగ్గురి మరణం

అమెరికాలోని బోస్టన్ నగరంలో బాంబు పేలుళ్లు సంభవించాయి. సెకన్ల వ్యవధిలో రెండు బాంబులు పేలగా మరో 5 పేలని బాంబులు దొరికాయని పోలీసులు తెలిపారు. 40 కి.మీ దూరం సాగే ‘బోస్టన్ మారధాన్’ పోటీ ముగింపు స్ధలంలో జరిగిన ఈ పేలుళ్లలో ముగ్గురు మరణించారు. 130 మందికి పైగా గాయపడ్డారు. పదుల సంఖ్యలో అవయవాలు తీసివేయాల్సి వచ్చిందని ఆసుపత్రుల అధికారుల సమాచారాన్ని ఉటంకిస్తూ పత్రికలు తెలిపాయి. బాల్ బేరింగ్ లాంటి ఇనప వస్తువులు కూరి బాంబులు తయారు…

హైదరాబాద్ బాంబు పేలుళ్లు, ముందే సమాచారం?!

హైదరాబాద్ మళ్ళీ బాంబు పేలుళ్లతో దద్దరిల్లింది. అత్యంత రద్దీగా ఉండే దిల్ షుక్ నగర్ బస్ స్టాండ్ ప్రాంతంలో రెండు చోట్ల అమర్చిన సైకిల్ బాంబులు పేలడంతో అనేకమంది మరణించగా మరెంతోమంది గాయపడ్డారు. 11 మంది చనిపోయారని, మరో 80 మంది గాయపడ్డారని, గాయపడినవారిలో ఐదు లేక ఆరుగురు తీవ్రంగా గాయపడినందున వారి పరిస్ధితి ప్రమాదకరంగా మారిందని రాష్ట్ర ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పత్రికలు, ఛానళ్లతో క్యాంపు కార్యాలయంలో మాట్లాడుతూ చెప్పాడు. ముఖ్యమంత్రి పత్రికలతో…

పాకిస్తాన్ ప్రభుత్వం, ఐ.ఎస్.ఐ ల ఆదేశంతోనే ముంబై దాడులు -అమెరికా కోర్టులో హేడ్లీ, రాణాలు – 1

ముంబై లోని తాజ్ హోటల్ పై టెర్రరిస్టు దాడులు పాకిస్తాన్ ప్రభుత్వం, దాని గూఢచార సంస్ధ ఐ.ఎస్.ఐ ల ఆదేశమ్ మేరకే చేశామని అమెరికా కోర్టులో నిందితులు హేడ్లీ, రాణాలు సాక్ష్యం ఇచ్చినట్లు బయటపడడంతో సంచలనానికి తెర లేచింది. ముంబై టెర్రరిస్టు దాడుల్లో తాజ్ హోటల్ లో బస చేసిన దేశ, విదేశీ అతిధులు 200 మంది వరకూ మరణించిన సంగతి విదితమే. ముంబై దాడుల్లో పట్టుబడ్డ పాకిస్తాన్ యువకుడు కసబ్ కి కోర్టు మరనశిక్ష విధించింది.…

సి.ఐ.ఏ హద్దు మీరుతోంది -అమెరికాకు పాకిస్తాన్ హెచ్చరిక

ఆఫ్ఘనిస్తాన్ లోని తాలిబాన్, ఆల్-ఖైదా లపై యుద్ధానికి పాకిస్తాన్ పైనే పూర్తిగా ఆధారపడ్డ అమెరికా, ఇటీవలి కాలంలో పాకిస్తాన్ నుండి ప్రతిఘటనను ఎదుర్కొంటోంది. ముఖ్యంగా పాకిస్తాన్ లో సి.ఐ.ఏ కార్యకలాపాల పట్ల పాకిస్తాన్ ప్రభుత్వం, మిలట్రీ, ఐ.ఎస్.ఐ లు ఆగ్రహంతో ఉన్నాయి. సి.ఐ.ఏ ఆధ్వర్యంలో నడిచే డ్రోన్ విమానాల దాడుల్లో వందలమంది పాకిస్తాన్ పౌరులు చనిపోతుండడంతో పాకిస్తాన్ ప్రజల్లో అమెరికా పట్ల విపరీతమైన ద్వేషం పెరిగింది. పాకిస్తాన్ అణ్వస్త్రాలను నిర్వీర్యం చేయడమే అమెరికా`ప్రభుత్వ అసలు ఉద్దేశమని కూడా…

ఇండియా యాంటీ-టెర్రరిస్టు సంస్ధ వివరాలను ఎఫ్.బి.ఐ కి నివేదించిన చిదంబరం -వికీలీక్స్

బొంబాయిలోని తాజ్ హోటల్ పై టెర్రరిస్టు దాడి జరిగిన తర్వాత ఆగమేఘాలమీద భారత ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్న టెర్రరిస్టు చర్యల పరిశోధనా సంస్ధ “నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ – ఎన్.ఐ.ఏ” (జాతీయ పరిశోధనా సంస్ధ) గురించి అమెరికా ఫెడరల్ పోలీసు డిపార్ట్ మెంటు అయిన ఎఫ్.బి.ఐ (ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్) అధికారికి వివరించినట్లుగా వికీలీక్స్ బయట పెట్టిన డిప్లొమాటిక్ కేబుల్ ద్వారా వెల్లడయ్యింది. ఒక సర్వసత్తాక స్వతంత్ర దేశమయిన భారత దేశానికి హోం మంత్రిగా ఉంటూ,…