Perfect war

పక్కా యుద్ధం (Perfect war) -కార్టూన్

– “పక్కా యుద్ధాన్నే మేం ప్రారంభించాం! ఇప్పుడంతా యుద్ధంలో మునిగిపోయారు. కాని తమ శత్రువు ఎవరో ఇప్పుడు చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు” – ‘టెర్రరిజం పై యుద్ధం’ పేరుతో అమెరికా ప్రారంభించిన యుద్ధానికి ఇప్పుడు దిక్కూ, దరీ లేదు. ‘టెర్రరిస్టులపై యుద్ధమే’ లక్ష్యం అయితే ఆ లక్ష్య శుద్ధి ప్రారంభంలోనే లేదు. ఆల్-ఖైదాతో యుద్ధం అని చెప్పి, అదే ఆల్జ్-ఖైదాతో కుమ్మక్కై ప్రభుత్వాలు ఏర్పరుస్తున్నారు. ఆఫ్ఘనిస్ధాన్ లో ఆల్-ఖైదాతో యుద్ధం, లిబియాలో ఆల్-ఖైదాతో కుమ్మక్కై…

అమెరికన్లపై నిఘా, ప్రపంచదేశాలపై శాశ్వత యుద్ధం: నల్లచట్టాలకు కాంగ్రెస్ ఆమోదం

అమెరికా లోపలా, బయటా తన అమానుషకృత్యాలను మరింత తీవ్రంగా, శక్తివంతంగా కొనసాగించడానికి అమెరికా ప్రతినిధుల సభ రెండు నల్ల చట్టాలను ఆమోదించింది. ఇప్పటికే దేశం లోపల అమలు చేయడానికి ఉన్న ఓ నల్ల చట్టాన్ని మరింతకాలం కొనసాగించడానికి ఆమోదం తెలుపుతూ, దేశం బైట ప్రపంచం మీద పెత్తనం కోసం అంతం లేని యుద్ధాలు చేసే హక్కును తమకు తాము దఖలుపరుచుకుంటూ రిపబ్లికన్ పార్టీ సభ్యులు మెజారిటీగా కల అమెరికా ప్రతినిధుల సభ, గతవారం చట్టాలను ఆమోదించింది. అమెరికా…

పాకిస్ధాన్ సైనికాధికారులను “మోస్ట్ వాంటెడ్” జాబితాలో చేర్చిన ఇండియా

భారత ప్రభుత్వం గత మార్చి నెలలో పాకిస్ధాన్ ప్రభుత్వానికి సమర్పించిన వాంటెడ్ వ్యక్తుల జాబితాలో ప్రస్తుతం సైన్యంలో అధికారులుగా బాధ్యతలు నిర్వహిస్తున్న వారి పేర్లు ఉన్న సంగతి వెల్లడయ్యింది. ఇండియా తన భూభాగంపై జరిగిన టెర్రరిస్టు దాడుల వెనక పాకిస్ధాన్ సైనికాధికారులు, మిలట్రీ గూఢచార సంస్ధ ఐ.ఎస్.ఐ పాత్ర ఉందని చాలా కాలంనుండి ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఇండియా హోం మంత్రిత్వ శాఖ కార్యదర్శి జి.కె.పిళ్ళై మార్చి నెలలో పాకిస్ధాన్ హోమ్ కార్యదర్శి ఖమర్ జమాన్ చౌదరితో…

అబ్బోత్తాబాద్ స్ధావరం కమాండ్ అండ్ కంట్రోల్ సెంటరా? అబ్బే, అంత సీన్ లేదు -అమెరికా, పాక్ అధికారులు

పాకిస్ధాన్‌‌లోని  అబ్బోత్తాబాద్‌ పట్టణంలో గల లాడెన్ స్ధావరమే ఆల్-ఖైదా కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌గా ఉపయోగిస్తున్నారని అమెరికా చెప్పడాన్ని అటు అమెరికాలోనూ, ఇటు పాకిస్తాన్ లోనూ చాలామంది అంగీకరించ లేకపోతున్నారు. లాడెన్ స్ధావరంగా చెప్పబడుతున్న స్ధావరంలో అతన్ని హత్య చేశాక అక్కడినుండి చాలా సమాచారాన్ని తీసుకెళ్ళినట్లుగా చెబుతున్నారు. ఈ సమాచారం ఒకేఒక టెర్రరిజం అనుమానితుడి వద్ద దొరికిన అతి పెద్ద గూఢచార సమాచారాల్లో ఒకటిగా ఇంటెలిజెన్స్ అధికారులు పేర్కొంటున్నారు. ఈ సమాచారం ద్వారా లాడెన్ చివరివరకూ చురుగ్గా…

అమెరికా డ్రోన్ విమానదాడిలో మరో 25 మంది పాక్ పౌరుల దుర్మరణం

పాక్, ఆఫ్ఘనిస్ధాన్ సరిహద్దులోని నార్త్ వజీరిస్తాన్ రాష్ట్రంలో అమెరికాకి చెందిన డ్రోన్ విమానం దాడిలో మరో పాతిక మంది దుర్మరణం చెందారు. డ్రోన్ విమానదాడులకు తాను భాధ్యురాలిగా అమెరికా సాధారణంగా ధృవీకరించదు. కాని ఈ ప్రాంతంలో డ్రోన్ విమానాలు ఒక్క అమెరికాకి తప్ప మరొక దేశానికి లేవు. ప్రారంభంలో డ్రోన్ దాడులు కొన్నింటికి భాధ్యత తనదిగా పేర్కొన్నప్పటికీ, ఇటీవల కాలంలో అటువంటి ప్రకటనలు రావడం లేదు. డ్రోన్ విమాన దాడుల్లో వందల కొద్దీ పాకిస్తాన్ పౌరులు చనిపోతుండడంతో…

పాకిస్తాన్ ప్రభుత్వం, ఐ.ఎస్.ఐ ల ఆదేశంతోనే ముంబై దాడులు -అమెరికా కోర్టులో హేడ్లీ, రాణాలు – 1

ముంబై లోని తాజ్ హోటల్ పై టెర్రరిస్టు దాడులు పాకిస్తాన్ ప్రభుత్వం, దాని గూఢచార సంస్ధ ఐ.ఎస్.ఐ ల ఆదేశమ్ మేరకే చేశామని అమెరికా కోర్టులో నిందితులు హేడ్లీ, రాణాలు సాక్ష్యం ఇచ్చినట్లు బయటపడడంతో సంచలనానికి తెర లేచింది. ముంబై టెర్రరిస్టు దాడుల్లో తాజ్ హోటల్ లో బస చేసిన దేశ, విదేశీ అతిధులు 200 మంది వరకూ మరణించిన సంగతి విదితమే. ముంబై దాడుల్లో పట్టుబడ్డ పాకిస్తాన్ యువకుడు కసబ్ కి కోర్టు మరనశిక్ష విధించింది.…

సి.ఐ.ఏ హద్దు మీరుతోంది -అమెరికాకు పాకిస్తాన్ హెచ్చరిక

ఆఫ్ఘనిస్తాన్ లోని తాలిబాన్, ఆల్-ఖైదా లపై యుద్ధానికి పాకిస్తాన్ పైనే పూర్తిగా ఆధారపడ్డ అమెరికా, ఇటీవలి కాలంలో పాకిస్తాన్ నుండి ప్రతిఘటనను ఎదుర్కొంటోంది. ముఖ్యంగా పాకిస్తాన్ లో సి.ఐ.ఏ కార్యకలాపాల పట్ల పాకిస్తాన్ ప్రభుత్వం, మిలట్రీ, ఐ.ఎస్.ఐ లు ఆగ్రహంతో ఉన్నాయి. సి.ఐ.ఏ ఆధ్వర్యంలో నడిచే డ్రోన్ విమానాల దాడుల్లో వందలమంది పాకిస్తాన్ పౌరులు చనిపోతుండడంతో పాకిస్తాన్ ప్రజల్లో అమెరికా పట్ల విపరీతమైన ద్వేషం పెరిగింది. పాకిస్తాన్ అణ్వస్త్రాలను నిర్వీర్యం చేయడమే అమెరికా`ప్రభుత్వ అసలు ఉద్దేశమని కూడా…