ఫుకుషిమా: 8 రెట్లు పెరిగిన రేడియేషన్
ఫుకుషిమా అణు కర్మాగారం వద్ద రేడియేషన్ ప్రమాద స్ధాయి కంటే 8 రెట్లు పెరిగిందని కర్మాగారాన్ని నిర్వహిస్తున్న టెప్కో (టోక్యో ఎలక్ట్రిక్ పవర్ కంపెనీ) కంపెనీ తెలిపింది. ప్రభుత్వం నిర్ణయించిన ప్రమాద స్ధాయి కంటే 8 రెట్లు పెరిగిందని అణు ధార్మికత నిండిన నీరు ట్యాంకర్ల నుండి లీక్ అవుతుండడమే దీనికి కారణం అని టెప్కో తెలిపింది. టోక్యో, జపాన్ ప్రజలకే కాకుండా అమెరికాకు కూడా వణుకు పుట్టిస్తున్న రేడియేషన్ లీకేజిని అరికట్టడానికి కంపెనీ వద్ద ఆధారపడదగిన…