టిడిపితో దోస్తీపై పునరాలోచనలో బిజెపి?

రాష్ట్రంలో టి.డి.పి, బి.జె.పి లు దగ్గరవుతున్న సూచనలు ప్రబలంగా కనిపిస్తున్నప్పటికీ ఆ విషయంలో బి.జె.పి పునరాలోచనలో పడినట్లు వివిధ వర్గాలు చెబుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో పూర్తి మద్దతు ఇచ్చిన బి.జె.పి తెలంగాణ వ్యతిరేకిగా ముద్ర పడిన టి.డి.పి తో దోస్తీ కట్టడానికి బి.జె.పి తెలంగాణ కార్యకర్తలు, నాయకులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తోంది. కేంద్రంలో ఎన్.డి.ఏ అధికారంలోకి వచ్చే పక్షంలో టి.ఆర్.ఎస్ కూడా ఆ కూటమిలో చేరే అవకాశాలున్నాయని బి.జె.పి నాయకులు కొందరు భావిస్తున్నారు. దానితో…