పట్టాలపై వాణిజ్య వసతీకరణ -ది హిందు ఎడిట్

-The Hindu Editorial dated November 18, 2014 (ప్రపంచ వాణిజ్యంలో) వివాదాస్పద అంశం ‘ఆహార భద్రత కోసం ఆహార ధాన్యాలను ప్రభుత్వం నిలువ చేసుకునే’ విషయంలో ఇండియా, అమెరికాల మధ్య కుదిరిన ఒప్పందం ప్రపంచ వాణిజ్య చర్చలను తిరిగి పట్టాల మీదికి తేవాల్సి ఉంది. ప్రపంచ వాణిజ్య సంస్ధ చరిత్రలో టి.ఎఫ్.ఏ గణనీయమైన అడుగు అనదగ్గ బహుళపక్ష “వాణిజ్య వసతీకరణ ఒప్పందం” (Trade Facilitation Agreement -TFA) ను కాపాడేందుకు ఈ ద్వైపాక్షిక సర్దుబాటు/రాజీ అత్యవసరమైన…