ఒడిషా: డెంగ్యూను పోషిస్తున్న టాటా స్టీల్

ఒడిషా రాష్ట్రంలో టాటా స్టీల్ నిర్మిస్తున్న భారీ ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణ కార్మికులను అవస్ధలకు గురి చేస్తోంది. ఫ్యాక్టరీ పరిసరాల్లో శుభ్రత పాటించకపోవడంతో కార్మికులు ప్రతి సంవత్సరం డెంగ్యూ జ్వరానికి గురై అవస్ధలు పడుతున్నారు. ఒడిషా ప్రభుత్వ శాఖలు టాటా యాజమాన్యం వైఖరిని తీవ్రంగా తప్పు పడుతున్నాయి. టాటా కంపెనీ ప్రతినిధులు మాత్రం ఇది ప్రతేడూ ఉండేదే అని చేతులు దులిపేసుకుంటున్నారు. టాటా గ్రూపు కంపెనీల్లో ఒకటయిన ‘టాటా స్టీల్’ కంపెనీ ఒకప్పుడు భారత దేశానికి ఒకే…