విరుద్ధ దృష్టితో ఒకే తీర్పు ఇచ్చిన ఇద్దరు జడ్జిలు -1
పశ్చిమ బెంగాల్ లో పాతికేళ్ళ అవిచ్ఛిన్న లెఫ్ట్ ఫ్రంట్ పాలనకు చరమగీతం పలికేందుకు దారి తీసిన సింగూరు భూములను బలవంతంగా లాక్కున కేసులో నిన్న (ఆగస్టు 31) సుప్రీం కోర్టు ద్విసభ్య ధర్మాసనం తీర్పు చెప్పింది. నానో కారు తయారీ కోసం టాటా మోటార్ కంపెనీకి అప్పగించడానికి వామపక్ష ప్రజాస్వామ్య కూటమి ప్రభుత్వం సింగూరు రైతుల నుండి గుంజుకున్న వ్యవసాయ భూములను తిరిగి రైతులకు ఇచ్చేయాలని సుప్రీం కోర్టు తీర్పు చెప్పింది. పశ్చిమ బెంగాల్ లో బలం…